ఉద్యోగాలే.. ఉద్యోగాలు! | Sakshi
Sakshi News home page

ఉద్యోగాలే.. ఉద్యోగాలు!

Published Sat, Oct 3 2015 8:14 AM

ఉద్యోగాలే.. ఉద్యోగాలు! - Sakshi

బెల్‌లో ఇంజనీర్లు
హైదరాబాద్‌లోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్)..  కాంట్రాక్ట్ పద్ధతిలో ఇంజనీర్ల పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. వివరాలు.. ఎలక్ట్రానిక్స్ (ఖాళీలు-15), మెకానికల్ (ఖాళీలు-6), ఎలక్ట్రికల్ (ఖాళీలు-1), సివిల్ (ఖాళీలు-1)  దరఖాస్తుకు చివరి తేది అక్టోబర్ 10. వయసు 25 ఏళ్లకు మించకూడదు. వివరాలకు   http://www.belindia.comలో చూడొచ్చు.
         
నేషనల్ లా యూనివర్సిటీలో ప్రొఫెసర్లు
ఢిల్లీలోని నేషనల్ లా యూనివర్సిటీ.. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వ్ చేసిన ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. వివరాలు.. ప్రొఫెసర్ (ఖాళీలు-1), అసోసియేట్ ప్రొఫెసర్ (ఖాళీలు-1), అసిస్టెంట్ ప్రొఫెసర్ (ఖాళీలు-4). పూర్తిచేసిన దరఖాస్తులను రిజిస్ట్రార్, నేషనల్ లా యూనివర్సిటీ, సెక్టార్-14, ద్వారకా, న్యూఢిల్లీ-110078 అడ్రస్‌కు పం పాలి. చివరి తేది నవంబర్ 1. వివరాలకు  http://nludelhi.ac.in/  చూడొచ్చు.
 
డీడీఏలో డైరెక్టర్లు, ఇంజనీర్లు
ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ(డీడీఏ).. వికలాంగులకు రిజర్వ్ చేసిన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. వివరాలు.. సీనియర్ లా ఆఫీసర్ (ఖాళీలు-1), అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (సివిల్) (ఖాళీలు-1), అసిస్టెంట్ డైరెక్టర్ (మినిస్టీరియల్) (ఖాళీలు-4), లీగల్ అసిస్టెంట్ (ఖాళీలు-3), ప్రోగ్రామర్ (ఖాళీలు-1), ప్లానింగ్ అసిస్టెంట్ (ఖాళీలు-1), జూని యర్ ఇంజనీర్ (సివిల్) (ఖాళీలు-5), సెక్షనల్ ఆఫీసర్ (హార్టి కల్చర్) (ఖాళీలు-3), అసిస్టెంట్ (ఖాళీలు-6) పోస్టుల భర్తీకి దర ఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆన్‌లైన్ దరఖాస్తుకి చివరి తేది నవంబర్ 2. వివరాలకు http://www.dda.org.in లో చూడొచ్చు.
 
బీపీయూటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు
ఒడిశాలోని బిజూ పట్నాయక్ వర్సిటీ ఆఫ్ టెక్నాలజీ (బీపీయూటీ).. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దర ఖాస్తులు ఆహ్వానిస్తోంది. వివరాలు.. సీఈటీ భువనేశ్వర్ (ఖాళీలు-4), పీఎంఈసీ బరంపూర్ (ఖాళీలు-26). చివరి తేదీ అక్టోబర్ 19. వివరాలకు http://www.bput.ac.inలో చూడొచ్చు.
 
అలగప్పా యూనివర్సిటీలో ప్రొఫెసర్లు
అలగప్పా యూనివర్సిటీ-కరైకుడి(తమిళనాడు).. ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. వివరాలు.. ప్రొఫెసర్ (మ్యాథ్స్) (ఖాళీ లు-1), ప్రొఫెసర్ (ఫిజికల్ ఎడ్యుకేషన్) (ఖాళీలు-1), అసోసియేట్ ప్రొఫెసర్ (మ్యాథ్స్) (ఖాళీలు-1), అసోసియేట్ ప్రొఫెసర్ (ఫిజిక్స్) (ఖాళీలు-1), అసోసియేట్ ప్రొఫెసర్ (కామర్స్) (ఖాళీలు-1), అసోసియేట్ ప్రొఫెసర్ (మేనేజ్‌మెంట్) (ఖాళీలు-2), అసోసియేట్ ప్రొఫెసర్ (బ్యాంక్ మేనేజ్‌మెంట్) (ఖాళీలు-1), అసిస్టెంట్ ప్రొఫెసర్ (ఫిజిక్స్) (ఖాళీలు-1), అసిస్టెంట్ ప్రొఫెసర్ (కంప్యూటర్ సైన్స్) (ఖాళీలు-1), అసిస్టెంట్ ప్రొఫెసర్ (బయోఇన్ఫర్మేటిక్స్) (ఖాళీలు-2), అసిస్టెంట్ ప్రొఫెసర్ (కామర్స్) (ఖాళీలు-1). ఆన్‌లైన్ దరఖాస్తుకి చివరి తేదీ అక్టోబర్ 19. http://alagappauniversity.ac.in లో చూడొచ్చు.    
 
సాయ్‌లో  రీసెర్చ్ ఫెలోస్
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్).. రీసెర్చ్ ఫెలో ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. వివరాలు.. ఆంథ్రోపొమెట్రీ (ఖాళీలు-2), న్యూట్రిషన్ (ఖాళీలు-2), సైకాలజీ (ఖాళీలు-2), ఫిజియాలజీ (ఖాళీలు-2).  వయసు 28 ఏళ్లకు మించకూడదు. దర ఖాస్తుకు చివరి తేది అక్టోబర్ 12. వివరాలకు  http://www.sportsauthorityofindia.nic.in  చూడొచ్చు.
 
ఓఎన్‌జీసీలో వివిధ పోస్టులు
ఆయిల్ అండ్  నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్  (ఓఎన్‌జీసీ) రాజమండ్రి, కాకినాడ.. వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. వివరాలు.. టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్-2 (కెమిస్ట్రీ),  అసి స్టెంట్ రిగ్‌మ్యాన్ (డ్రిల్లింగ్), అసిస్టెంట్ టెక్నీషియన్ (సివిల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, మెకానికల్, ప్రొడక్షన్), అసిస్టెంట్ గ్రేడ్-3 (ట్రాన్‌‌సపోర్ట్), సెక్యూరిటీ సూపర్‌వైజర్, జూనియర్ అసిస్టెంట్ టెక్నీషియన్ (సిమెంటింగ్, డీజిల్, ఫిట్టింగ్, ఎలక్ట్రికల్), జూనియర్ అసిస్టెంట్ రిగ్‌మ్యాన్ (డ్రిల్లింగ్), జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ (జియాలజీ), జూనియర్ అసిస్టెంట్ (అకౌంట్స్, మెటీరియల్ మేనేజ్‌మెంట్), జూనియర్ సెక్యూరిటీ సూపర్‌వైజర్, జూనియర్ మోటార్ వెహికల్ డ్రైవర్ (హెచ్‌వీ), జూనియర్ ఫైర్‌మెన్. వయసు 30 ఏళ్లు మించకూడదు. ఆన్‌లైన్   దరఖాస్తుకు చివరి తేది అక్టోబర్ 20.  మరిన్ని వివరాలకు www.ongcindia.com చూడొచ్చు.
 
వాప్‌కాస్‌లో ఇంజనీరింగ్ ట్రైనీలు
వాటర్  రిసోర్సెస్, పవర్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (వాప్‌కాస్).. సివిల్, ఎలక్ట్రికల్ విభాగాల్లో  ఇంజనీరింగ్ ట్రైనీ  పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 25. వయసు 30 ఏళ్లకు మించకూడదు. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది అక్టోబర్ 12.  వివరాలకు www.wapcos.gov.in చూడొచ్చు.
 
వైఎస్‌ఆర్‌హెచ్‌యూలో అసోసియేట్స్
డాక్టర్ వైఎస్‌ఆర్ హార్టికల్చరల్ యూనివర్సిటీ.. తాత్కాలిక పద్ధతిలో   అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ (ఖాళీలు-3), ఎంటమాలజీ (ఖా ళీలు-2), ప్లాంట్ పాథాలజీ (ఖాళీలు-4) విభాగాల్లో టీచింగ్/ రీసెర్‌‌చ అసోసియేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొ త్తం ఖాళీలు 9. దరఖాస్తుకు చివరి తేది అక్టోబర్ 15. వివరాలకు  www.drysrhu.edu.in చూడొచ్చు.
 
ఎన్‌వైకేఎస్‌లో  యూత్ కో- ఆర్డినేటర్లు
నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ (ఎన్‌వైకేఎస్).. వికలాంగుల కోటాలో డిస్ట్రిక్ట్ యూత్ కో-ఆర్డినేటర్ (ఖాళీలు 9), అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్ (ఖాళీలు-6) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వయసు 38 ఏళ్లు మించకూడదు. దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్ 20. వివరాలకు  www.nyks.org చూడొచ్చు.
 
కొచ్చిన్ షిప్‌యార్డులో వివిధ పోస్టులు
కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్.. వికలాంగుల కోటాలో వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. వివరాలు.. డిప్యూటీ మేనేజర్ (ఖాళీ-1), వెల్డర్ కమ్ ఫిట్టర్ (ఖాళీలు-11), ఫిట్టర్ (ఎలక్ట్రికల్) (ఖాళీలు-2), జనరల్ వర్కర్ (క్యాంటీన్) (ఖాళీలు-2), నిర్దేశిత విధానంలో పూర్తి చేసిన దరఖాస్తును ‘ద జనరల్ మేనేజర్ (హెచ్‌ఆర్), కొచ్చిన్ షిప్‌యార్‌‌డ లిమిటెడ్, పెరమనూర్, కోచి-682015’కు పంపాలి. దరఖాస్తులకు చివరి తేది నవంబర్ 10. వివరాలకు http://cochinshipyard.com చూడొచ్చు.

ఎన్‌ఐటీ- రాయ్‌పూర్‌లో అసిస్టెంట్స్
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌ఐటీ) - రాయ్‌పూర్.. టెక్నికల్ అసిస్టెంట్ (ఖాళీలు-13), ల్యాబ్ అసిస్టెంట్/వర్క్ అసిస్టెంట్ (ఖాళీలు-32) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. దరఖాస్తుకి చివరి తేదీ అక్టోబర్ 23. వివరాలకు http://nitrr.ac.in చూడొచ్చు.

Advertisement
Advertisement