ఐసీఎస్‌ఐఎల్‌లో 145 పోస్టులు | Sakshi
Sakshi News home page

ఐసీఎస్‌ఐఎల్‌లో 145 పోస్టులు

Published Wed, Oct 19 2016 3:29 AM

145 posts in ICSIL

 ఇంటెలిజెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇండియా లిమిటెడ్ (ఐసీఎస్‌ఐఎల్)..
 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) అసిస్టెంట్,
 డేటా ఎంట్రీ ఆపరేటర్ (డీఈవో) పోస్టులను
 కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేసేందుకు
 నోటిఫికేషన్ విడుదల చేసింది.
 
 మొత్తం ఖాళీలు
 145 (ఐటీ అసిస్టెంట్-12, డీఈవో-133)
 
 విద్యార్హతల వారీగా డీఈవో ఖాళీలు
 1.డిగ్రీ ఉత్తీర్ణత, టైపింగ్ స్పీడ్ ఆధారంగా భర్తీ చేసేవి: 65
 2.అండర్ గ్రాడ్యుయేషన్ (10+2) ఉత్తీర్ణత, టైపింగ్ స్పీడ్ ఆధారంగా భర్తీ చేసేవి: 57
 3.యూజీ, ‘కంప్యూటర్ అప్లికేషన్స్‌లో ఏడాది డిప్లొమా’ అర్హతతో భర్తీ చేసేవి: 11
 వేతనం: ఢిల్లీ ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా చెల్లిస్తారు.
 విద్యార్హత, అనుభవం: ఐటీ అసిస్టెంట్‌కు కనీసం ఆర్నెల్ల పని అనుభవంతోపాటు అదనపు విద్యార్హత (కంప్యూటర్ అప్లికేషన్స్‌లో ఏడాది డిప్లొమా) ఉండాలి.    
 
 టైపింగ్ స్పీడ్
 1.ఐటీ అసిస్టెంట్: నిమిషానికి కనీసం 20 పదాలను 80 శాతం కరెక్ట్‌గా టైప్ చేయాలి.
 2.డీఈవో: నిమిషానికి కనీసం 30 ఇంగ్లిష్ పదాలను టైప్ చేయాలి.
 పని వేళలు: డీఈవోలు డే/నైట్ షిఫ్టుల్లో
 పనిచేయాలి.
 
 దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేయాలి.
 దరఖాస్తు/పరీక్ష రుసుం: రూ.200ను నగదు రూపంలో/ఐసీఎస్‌ఐఎల్ పేరిట పోస్టల్ ఆర్డర్ రూపంలో పరీక్ష సమయంలో చెల్లించాలి.
 
 చివరి తేదీ: అక్టోబర్ 24 (సోమవారం)
 గమనిక: పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు నాలుగు ఫొటోలను; సెల్ఫ్ అటెస్ట్ చేసిన విద్యార్హత, అనుభవ ధ్రువీకరణ పత్రాల నకళ్లను; ఒరిజినల్ సర్టిఫికెట్లను తీసుకురావాలి. పోస్టు ద్వారా/ఇ-మెయిల్ రూపంలో/వ్యక్తిగతంగా పంపిన దరఖాస్తులను అనుమతించరు. అయితే పరీక్ష సమయంలో అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకొని, వివరాలను నింపి ఇవ్వొచ్చు.   
 వెబ్‌సైట్: www.icsil.in/jobs
 

Advertisement

తప్పక చదవండి

Advertisement