యువకుడి అనుమానాస్పద మృతి | Sakshi
Sakshi News home page

యువకుడి అనుమానాస్పద మృతి

Published Fri, Jul 21 2017 10:31 PM

యువకుడి అనుమానాస్పద మృతి

గుత్తి: ఇంటి నుంచి బయటకెళ్లిన యువకుడు మూడు రోజుల అనంతరం బావిలో శవమై తేలాడు. వివరాలిలా ఉన్నాయి. గుత్తి పట్టణంలోని బెస్త వీధికి చెందిన విజయబాబు(26) ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద ఉన్న సురేష్‌ దుకాణంలో పని చేసేవాడు. గత బుధవారం ఇంటి  నుంచి బయటకు వెళ్లిన విజయబాబు దుకాణానికి వెళ్లలేదు. ఇంటికీ రాలేదు. దీంతో అతడి కోసం కుటుంబ సభ్యులు గాలించినా ఎక్కడా ఆచూకీ లభ్యం కాలేదు.

అయితే శుక్రవారం పట్టణ శివారులోని లచ్చానపల్లి రోడ్డులో ఉన్న మునిసిపాలిటీ బావిలో శవమై తేలాడు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న ఏఎస్‌ఐ ప్రభుదాస్‌ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఎవరో హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నిజానిజాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
 
Advertisement