గంటరాయిలో వ్యక్తి దారుణ హత్య | Sakshi
Sakshi News home page

గంటరాయిలో వ్యక్తి దారుణ హత్య

Published Fri, Sep 23 2016 1:51 PM

The brutal murder of a man

జి.మాడుగుల మండలం వంతాల పంచాయతీ గంటరాయి గ్రామంలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. వివరాలు.. గ్రామానికి చెందిన వంతాల చందర్‌రావు(25), బాలన్న(35) బావాబామ్మర్థులు. వీరి మధ్య భూమి విషయంలో ఈ మధ్య గొడవ జరుగుతోంది. అలాగే వీరి పొలం వద్ద భూమి దున్నుతుండగా శుక్రవారం గొడవపడ్డారు. కోపోద్రిక్తుడైన బాలన్న, చందర్‌రావును గొడ్డలితో నరికి చంపాడు. ఈ ఘటనలో తీవ్రగాయాలపాలైన చందర్‌రావు అక్కడికక్కడే మరణించాడు. సంఘటనాస్థలాన్ని సీఐ విజయ్‌కుమార్ పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాడు. నిందితుడు పరారీలో ఉన్నాడు.

 

Advertisement
 
Advertisement
 
Advertisement