మెడికల్‌ ఆఫీసర్‌ ఎంపిక జాబితా విడుదల | Sakshi
Sakshi News home page

మెడికల్‌ ఆఫీసర్‌ ఎంపిక జాబితా విడుదల

Published Sat, Jul 22 2017 10:49 PM

medical officer final list release

అనంతపురం మెడికల్‌: జిల్లాలో 24 గంటలు పని చేసే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 37 మెడికల్‌ ఆఫీసర్ల నియామకానికి సంబంధించి ఫైనల్‌ మెరిట్‌ లిస్ట్‌ శనివారం రాత్రి విడుదల చేశారు. ఈ నెల 27న ఉదయం 11 గంటలకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. జాబితాను  www.anantapuramu.ap.gov.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఎంపికైన వారికి పోస్ట్, ఈ మెయిల్, సెల్‌ఫోన్‌లకు మెసేజ్‌ పంపినట్లు డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ వెంకటరమణ తెలిపారు. ఎంపికైన వారిలో ఎవరైనా గైర్హాజరైతే మెరిట్‌ ప్రకారం తరువాతి స్థానంలో ఉన్న వారికి అదే రోస్టర్‌ మేరకు నియామక ఉత్తర్వులు అందజేయనున్నట్లు స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement