కళాకారులకు ఇదేనా ప్రోత్సాహం? | Sakshi
Sakshi News home page

కళాకారులకు ఇదేనా ప్రోత్సాహం?

Published Sat, Jun 3 2017 3:52 AM

కళాకారులకు ఇదేనా ప్రోత్సాహం? - Sakshi

జానపద కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షురాలు రజిత
నిర్మల్‌అర్బన్‌: నిజమైన తెలంగాణ కళాకారులను జిల్లా యంత్రాంగం గుర్తించకపోవడం విచారకరమని తెలంగాణ జానపద కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షురాలు ఎట్టెం రజిత అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ విశ్రాంతి భవనంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం కళాకారులను ప్రోత్సహిస్తున్నామని చెప్తుంటే జిల్లాలో మాత్రం దానికి విరుద్ధంగా ఉందన్నారు.

రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కళాకారులకు ఇచ్చే అవార్డుల ఎంపికలో పారదర్శకత లోపించిందన్నారు. కళాకారులను విస్మరించారని పేర్కొన్నారు. జేసీ అన్నీ తానై అనర్హులకు అ వార్డులు ఎంపిక చేశారని ఆరోపించారు. కళాకారులకు ఇచ్చే ప్రోత్సాహం ఇదేనా? అని ప్రశ్నించారు. సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీని వాస్‌ కృష్ణస్వామి, కోశాధికారి జున్ను అనిల్, చిందు కళాకారులు లచ్చారాం, గంగాధర్, రాజేశ్వర్, సుదర్శన్, మహేష్, రామస్వామి, పరమేష్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement