ఒక కోడి గుడ్డులో రెండు సొనలు | Sakshi
Sakshi News home page

ఒక కోడి గుడ్డులో రెండు సొనలు

Published Tue, Aug 23 2016 11:26 PM

కోడిగుడ్డు లోపల రెండు సొనలు బయటపడిన దృశ్యం

సీతాపురం( వజ్రపుకొత్తూరు): మండలంలోని సీతాపురం గ్రామంలో ఒక కోడి గుడ్డులో  రెండు సొనలు కనిపించడంతో అంతా ఆసక్తిగా తిలకించారు. స్థానిక అంగన్‌వాడీ కేంద్రంలో అంగన్‌వాడీ కార్యకర్త బమ్మిడి భాగ్యవతి అంగన్‌వాడీ బాలబాలికలకు ఉడికించిన గుడ్లు పంపిణీ చేస్తుండగా గుడ్డులో పసుపు రంగులో ఉన్న రెండు వేరు వేరు సొనలు కపిపంచడంతో ఆశ్చర్యం వ్యక్తం చేసారు. విద్యార్థులు, గ్రామంలోని మహిళలు ఈ చిత్రాన్ని ఆసక్తిగా తిలకించారు. ఈ విషయమై గోవిందపురం పశువైధ్యాధికారి జి. మన్మధరావును సంప్రదించగా అండం విడుదల సమయంలో రెండుగా విభజన చెందడం వల్ల జన్యుపరమైన కారణాలతో ఇలా రెండు సొనలు కనిపిస్తాయని ఇది చాలా అరుదుగా కనిపిస్తుంటుందని చెప్పారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement