చోరీకొచ్చి.. అడ్డంగా దొరికిపోయాడు | Sakshi
Sakshi News home page

చోరీకొచ్చి.. అడ్డంగా దొరికిపోయాడు

Published Mon, Oct 5 2015 2:20 PM

చోరీకొచ్చి.. అడ్డంగా దొరికిపోయాడు - Sakshi

మొమిన్‌పేట: ఓ బ్యాంకులో చోరికి యత్నించిన దొంగ అడ్డంగా దొరికిపోయాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మొమిన్‌పేట మండలం కేంద్రంలో ఆదివారం అర్ధరాత్రి తర్వాత చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... మొమిన్‌పేట ఆంధ్రాబ్యాంకులో అర్ధరాత్రి సమయంలో బ్యాంకుకు ఉన్న కిటీకీలు తొలగించి ఓ వ్యక్తి బ్యాంకులోకి ప్రవేశించాడు. తర్వాత ఏదో పగలకొడుతున్నప్పుడు శబ్దం రావడంతో పై పోర్షన్‌లో ఉంటున్న యజమానికి అనుమానం వచ్చి పోలీసులకు ఫోన్ చేశాడు.

సంఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్న పోలీసులు బ్యాంకులోపల ఉన్న దొంగను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని అరెస్ట్ చేశారు. పట్టుబడిన నిందితుడు మొమిన్‌పేట మండలం గోవిందాపూర్‌కు చెందిన ఊరడి రవి(35)గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement