కొత్త గ్యాస్ కేటాయింపుల విధానంపై చమురు శాఖ కసరత్తు
న్యూఢిల్లీ: సిటీ గ్యాస్ పంపిణీ (సీజీడీ) ప్రాజెక్టులకు పెద్ద పీట వేస్తూ సహజ వాయువు కేటాయింపుల విధానాన్ని కేంద్రం సవరించింది. దీని ప్రకారం సీజీడీ సంస్థలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, అటు పైన ఆటమిక్ ఎనర్జీ.. స్పేస్ రీసెర్చ్‌కి అవసరమయ్యేవి సరఫరా చేసే వాటికి రెండో ప్రాధాన్యం ఇవ్వాలని చమురు శాఖ భావిస్తోంది. ఇక పెట్రోకెమికల్స్ మొదలైనవి వెలికితీసే ప్రాజెక్టులకు రోజుకి 1.5 మిలియన్ ప్రామాణిక ఘనపు మీటర్ల (ఎంఎస్‌ఎండీ) గ్యాస్‌ను ఇవ్వాలని, నాలుగో ప్రాధాన్యత కింద గ్యాస్ ఆధారిత యూరియా ప్లాంట్లకు కేటాయించాలని యోచిస్తోంది. నియంత్రిత టారిఫ్‌ల కింద విద్యుత్‌ను సరఫరా చేసే షరతుపై పవర్ ప్లాంట్లకు తర్వాత స్థానం దక్కుతుంది.
ఇక దేశీయంగా తయారీ రంగాన్ని ప్రోత్సహించేం దుకు చిన్న, మధ్య తరహా సంస్థలకు గ్యాస్ కేటాయింపుల్లో ప్రాధాన్యం దక్కనుంది. ఈ మేరకు ప్రతిపాదనను చమురు శాఖ.. కేంద్ర క్యాబినెట్ ముందుకు తేనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దేశీయంగా ఉత్పత్తి చేసే గ్యాస్ కేటాయింపుల్లో ప్రస్తుతం యూరియా తయారీ ప్లాంట్లకు మొదటి ప్రాధాన్యత లభిస్తోంది. ద్రవీకృత పెట్రోలియం గ్యాస్ (ఎల్పీజీ) ప్లాంట్లు, విద్యుదుత్పత్తి ప్రాజెక్టులు, వాహనాలు.. గృహాలకు గ్యాస్ సరఫరా చేసే సీజీడీ ప్రాజెక్టులు వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
సిటీ గ్యాస్‌కు ప్రాధాన్యత!
Published Fri, Dec 19 2014 12:48 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్‌స్టాప్‌గా...
- ఐపీఎల్‌పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్‌బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement