అసెంబ్లీలో చంద్రంపేట ప్రస్తావన | Sakshi
Sakshi News home page

అసెంబ్లీలో చంద్రంపేట ప్రస్తావన

Published Tue, Dec 23 2014 2:38 AM

YS Jagan Mohan Reddy speech Chandampet issue in Assembly

 సాక్షి ప్రతినిధి, విజయనగరం : రుణమాఫీ దగాతో నష్టపోయిన గంట్యాడ మండలం చంద్రంపేట రైతుల సమస్యను వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీలో ప్రస్తావిస్తాంచారు. ప్రభుత్వ నిర్వాకాన్ని కేస్ స్టడీస్‌తో వివరించారు. ప్రభుత్వం విధానాన్ని దుయ్యబట్టారు. గంట్యాడ మండలం చంద్రంపేటలో బండారు రామునాయుడికి 2.63  ఎకరాల భూమి ఉంది. అందులో వరి పండించేందుకు  లక్కిడాం ఎస్‌బీహెచ్‌లో రూ.50 వేల  రుణం తీసుకున్నారు. కానీ ఆయనకు కేవలం రూ.3.10 పైసల రుణం మాత్రమే మాఫీ అయింది. అలాగే అదే గ్రామానికి చెందిన బండారు అప్పలనాయుడికి 2.63  ఎకరాల భూమి ఉంది .  వరి పంట నిమిత్తం రూ.50 వేలు రుణం తీసుకున్నారు.    రుణ మాఫీలో కేవలం రూ.95 మాత్రమే మాఫీ అయింది.
 
 సోమవారం  అసెంబ్లీలో రుణమాఫీ పై చర్చజరిగినప్పుడు వీరిద్దరికీ జరిగిన అన్యాయాన్ని కేస్ స్టడీలుగా తీసుకుని  ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించడమే కాకుండా, సర్కార్ తీరును ఎండగట్టారు. అసెంబ్లీలో రుణమాఫీపై చర్చ జరిగినప్పుడు మన జిల్లాలోని గంట్యాడ మండలం చంద్రంపేట రైతులకు చంద్రబాబు చేసిన రుణ మాఫీ దగాను వైఎస్ జగన్ ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాలను  టీవీల ద్వారా జిల్లాలో చాలా మంది వీక్షించారు.  తమ తరఫున   అసెంబ్లీలో ప్రస్తావించి, న్యాయం జరిగేలా ప్రతిపక్ష నేత డిమాండ్ చేయడంపై హర్షం వ్యక్తం చేశారు.  క్షేత్రస్థాయిలో వాస్తవాలు చెప్పినప్పుడే ప్రభుత్వం కళ్లు తెరుస్తుందని, లోపాలను సరిదిద్దుకుని న్యాయం చేసే అవకాశం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.  
 

Advertisement
Advertisement