వైఎస్ఆర్ సీపీకి టీడీపీకి ఓట్ల తేడా ఐదు లక్షలే: వైఎస్ జగన్ | Sakshi
Sakshi News home page

వైఎస్ఆర్ సీపీకి టీడీపీకి ఓట్ల తేడా ఐదు లక్షలే: వైఎస్ జగన్

Published Mon, Nov 24 2014 1:12 PM

వైఎస్ఆర్ సీపీకి టీడీపీకి ఓట్ల తేడా ఐదు లక్షలే: వైఎస్ జగన్ - Sakshi

ఒంగోలు : ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీకి...టీడీపీకి ఓట్ల తేడా అయిదు లక్షలేనని ఆపార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఆయన సోమవారం ప్రకాశం జిల్లా పార్టీ సమీక్ష సమావేశాల్లో భాగంగా ఒంగోలులో మాట్లాడారు. ముఖ్యమంత్రి కావడానికి చంద్రబాబు ఎన్నో అబద్ధాలు చెప్పారని అన్నారు. చంద్రబాబులా అబద్ధాలు చెప్పిఉంటే వైఎస్ఆర్ సీపీ అధికారంలోకి వచ్చేందన్నారు.  చంద్రబాబుకు లేనిదీ...మనకు ఉన్నది ...దేవుడి దయ అని వైఎస్ జగన్ అన్నారు.  అనంతరం ఆయన కందుకూరు నియోజకవర్గం పార్టీ నేతలుతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

Advertisement
Advertisement