మహిళలు భావ స్వాతంత్య్రాన్ని కోల్పోతున్నారు | Sakshi
Sakshi News home page

మహిళలు భావ స్వాతంత్య్రాన్ని కోల్పోతున్నారు

Published Thu, Aug 21 2014 2:47 AM

మహిళలు భావ స్వాతంత్య్రాన్ని కోల్పోతున్నారు

టొరెంటో వర్సిటీ ప్రొఫెసర్ ఎంజెలా మిల్స్
హెచ్‌సీయూలో ముగిసిన ఉమెన్ వరల్డ్ కాంగ్రెస్    

 
హైదరాబాద్: పురుషాధిక్య ధోరణి వల్ల మహిళలు భావ స్వాతంత్య్రాన్ని కోల్పోతున్నారని  టొరెంటో యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎంజెలా మిల్స్ అన్నారు. సెంట్రల్ యూనివర్సిటీలో గత నాలుగు రోజులుగా జరుగుతున్న 12వ ఉమెన్ వరల్డ్ కాంగ్రెస్ బుధవారం ముగిసింది. ఈ సందర్బంగా జరిగిన ము గింపు సమావేశంలో ఎంజెలా మాట్లాడుతూ.. మహిళల భావ స్వాతంత్య్ర హక్కును సమాజం నొక్కిపెడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి చెందిన అమెరికాలో కూడా మహిళల స్వాతంత్య్రం ఎండమావిగానే మిగిలిపోయిందన్నారు.

విద్య ద్వారానే మార్పు సాధ్యం కాదని, ఆలోచనలో మార్పుకోసం సామాజిక ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రపంచ సాహిత్యంలో మహిళల పాత్రను తక్కువ చేసి చూపారని వారి విజయాలను సరైన రీతిలో నమోదు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
 ఆకట్టుకున్న సాలిడారిటీ మార్చ్...: సదస్సు ముగిసిన అనంతరం 58 దేశాల ప్రతి నిధులు నిర్వహించిన సాలిడారిటీ మార్చ్ ఆకట్టుకుంది. మహిళ హక్కులు రక్షించాలి, అభివృద్ధికి బాటలు వేయాలి అంటూ వివిధ భాషల్లో మహిళలు నినదించారు. ఈ కార్యక్రమం లో సదస్సు డెరైక్టర్ ప్రొఫెసర్ రేఖా పాండే, డిప్యూటీ డెరైక్టర్ వి.సీత పాల్గొన్నారు.
 
 

Advertisement
Advertisement