మినీ మహానాడు ఏర్పాట్ల పరిశీలన | Sakshi
Sakshi News home page

మినీ మహానాడు ఏర్పాట్ల పరిశీలన

Published Fri, May 22 2015 1:48 AM

Telugu Desam leaders spar at mini-Mahanadu

 పాలకొల్లు టౌన్ : జిల్లా తెలుగుదేశం పార్టీ, రాష్ట్ర అధిష్టానం పాలకొల్లు నియోజకవర్గంలో మినీ మహనాడు జరపాలని నిర్ణయించడం పార్టీ నాయకులు, కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని నింపిందని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. స్థానిక హౌసింగ్‌బోర్డులో ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యాలయం వద్ద గురువారం జరిగిన పాలకొల్లు నియోజకవర్గ కార్యకర్తల, నాయకుల సమావేశంలో మాట్లాడారు. ఈ మినీ మహానాడును రాష్ట్రంలో ఎక్కడా జరగని విధంగా దీన్ని విజయవంతం చేయడానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలన్నారు. ఈ నెల 23వ తేదీ శనివారం ఉదయం 8గంటల నుంచి బ్రాడీపేట బైపాస్‌రోడ్డులోని ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న సభా ప్రాంగణంలో జరుగుతుందన్నారు.
 
 ఈ మినీమహానాడుకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి కన్వీనర్ నారా లోకేశ్, జిల్లాలోని 15 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్ మంత్రి, మంత్రులు పాల్గొంటారన్నారు. 36 గంటల సమయం మాత్రమే ఉందని, దీన్ని ప్రతి కార్యకర్త, నాయకులు, వార్డు కమిటీలు, గ్రామ కమిటీలు బాధ్యత తీసుకోవాలన్నారు. 23వ తేదీ ఉదయం 8గంటల నుంచి గాంధీబొమ్మల సెంటర్‌లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ర్యాలీగా సభా ప్రాంగణానికి వెళతామన్నారు. అనంతరం ఎమ్మెల్యే రామానాయుడు బ్రాడీపేట బైపాస్‌రోడ్డులోని సభా ప్రాంగణ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమాల్లో మునిసిపల్ చైర్మన్ వల్లభు నారాయణమూర్తి, ఏఎంసీ చైర్మన్ గొట్టుముక్కల గాంధీభగవాన్‌రాజు, వైస్ చైర్‌పర్సన్ కర్నేన రోజారమణి, జెడ్పీటీసీ కోడి విజయలక్ష్మి, ఎంపీపీ పెన్మెత్స శ్రీదేవి, బొప్పన సుజాత, మండల, పట్టణ పార్టీ నాయకులు బోనం నరసింహరావు, గండేటి వెంకటేశ్వరరావు, చిట్టూరి సీతారామాంజనేయులు, మాతా రత్నరాజు, పాముల రజనీకుమార్, కుక్కల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement