ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయిస్తాం | Sakshi
Sakshi News home page

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయిస్తాం

Published Mon, Feb 15 2016 3:11 AM

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయిస్తాం - Sakshi

వైఎస్సార్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ నేతలను గెలిపించండి
ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి, చింతల

  
 పీలేరు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయిస్తామని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యద ర్శి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డిరామచంద్రారెడ్డి, పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అన్నారు. ఆదివారం వారు పీలేరులో పర్యటిం చారు. కొత్తపల్లెలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మిత్రులు, శ్రేయోభిలాషులు, వైఎస్సార్ కాం గ్రెస్ పార్టీ అభిమాన కార్మికులంతా ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో వైఎస్సార్ ఆర్టీసీ మజ్దూర్ యూని యన్ నేతలకు ఓట్లు వేసి గెలిపించాల ని కోరారు.

వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ఆయన సీఎం అయిన ఆరు నెలల్లోనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయిస్తామన్నారు.  టీడీపీ ప్రభుత్వం ఆర్టీసీని నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. ఆర్టీసీని ప్రయివేట్‌పరం చేసేందుకు అద్దె బస్సులను అడ్డగోలుగా తీసుకుం టోందన్నారు. పీలేరు, కేవీపల్లె జెడ్పీటీసీ సభ్యులు ఎం. రెడ్డిభాషా, జీ. జయరామచంద్రయ్య, ఎంపీపీ కే. మహితాఆనంద్, మండల ఉపాధ్యక్షుడు కంభం సతీష్‌రెడ్డి, మండల కో-ఆప్షన్ సభ్యుడు ఎస్. హబీబ్‌బాషా, వైఎస్సార్‌సీపీ మండల కన్వీన ర్ నారే వెంకట్రమణారెడ్డి, ఎంపీటీసీ సభ్యులు వై. హరిణి, ఎం. భానుప్రకాష్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement
Advertisement