ఏపిలో భారీ వర్షాలు | Sakshi
Sakshi News home page

ఏపిలో భారీ వర్షాలు

Published Sun, Oct 26 2014 11:24 PM

ఏపిలో భారీ వర్షాలు - Sakshi


హైదరాబాద్: ఏపిలో పలు ప్రాంతాలలో భారీ వర్షాలు కురిశాయి. కొన్ని ప్రాంతాలలో ఇంకా వర్షం పడుతూనే ఉంది.  కర్నూలు జిల్లాలో బనగానపల్లి, కోయిలకుంట్ల, కొలిమిగుండ్ల, సంజమాల, అవుకు మండలాలలో భారీగా వర్షం కురిసింది. కోయిలకుంట్ల-అవుకు మధ్య పాలేయ వాగు పొంగిపొర్లుతోంది. వెలిగోడు మండలం మార్లమడికి సమీపంలో వేదావతి నది పొంగిపొర్లుతోంది. బళ్లారి, కర్నూలు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

శ్రీశైలం ప్రాజెక్టు నీటి మట్టం 856.40 అడుగులకు చేరుకుంది. లెప్ట్ పవర్ హౌస్లో శనివారం రాత్రి నుంచి విద్యుత్ ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. ఇరిగేషన్ అధికారులు  సుంకేసుల ప్రాజెక్టు నుంచి శ్రీశైలం జలాశయానికి 2,280 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.

గుంటూరు జిల్లా మాచవరం, పిడుగురాళ్ల, దాచేపల్లి, గురజాల మండలాలలో భారీ వర్షాలు కురిశాయి. ఈ మండలాలలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లాలలో ఏలూరుతోపాటు పలు ప్రాంతాలలో వర్షం కురిసింది.
శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా చిరుజల్లులు పడ్డాయి.
**

Advertisement

తప్పక చదవండి

Advertisement