చంపుతారేమోనని చంపేశారు : డీఐజీ | Sakshi
Sakshi News home page

చంపుతారేమోనని చంపేశారు : డీఐజీ

Published Thu, May 25 2017 1:16 AM

cherukulapadu narayana reddy murder case, 12 arrested by dhone police





నారాయణరెడ్డి హత్య కేసులో 12 మంది అరెస్టు

కర్నూలు: చెరుకులపాడు గ్రామానికి చెందిన పెద్ద బీసన్న కుమారుడు రామాంజనే యులు, కోతుల రామానాయుడులను చంపుతామని నారాయణరెడ్డి మనుషులు బెదిరించడం వల్లే పత్తికొండ నియోజకవర్గం వైఎస్‌ఆర్‌సీపీ ఇన్‌చార్జి చెరుకులపాడు నారా యణరెడ్డి, ఆయన అనుచరుడు బోయ సాంబశివుడులను ప్రత్యర్థులు హత్య చేసిన ట్లు పోలీసులు విచారణలో తేల్చారు. నారా యణరెడ్డి హత్య కేసులో 12 మంది నింది తులను డోన్‌ డీఎస్పీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక టీమ్‌ కాల్వబుగ్గ వద్ద అరెస్టు చేశారు. నేరానికి ఉపయోగించిన రెండు ట్రాక్టర్లు, వేటకొడవళ్లను స్వాధీనం చేసుకొని బుధవారం సాయంత్రం జిల్లా కేంద్రానికి తీసుకొచ్చి డీఐజీ రమణకుమార్, ఎస్పీ ఆకె రవికృష్ణ ఎదుట హాజరు పరిచారు.

నిందితులను  మీడియా ముందు హాజరు పరిచారు. కాగా, ఈనెల 21వ తేదీన నారాయణరెడ్డి, బోయ సాంబశివుడు కృష్ణగిరి పొలిమేరల్లో హత్యకు గురయ్యారని గొళ్ల కృష్ణమోహన్‌ ఫిర్యాదు మేరకు కృష్ణగిరి పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేసుకొని డోన్‌ డీఎస్పీ బాబా ఫకృద్దీన్‌ నేతృత్వంలో మూడు బృందాలుగా ఏర్పడి నిందితులను పట్టుకున్నట్లు డీఐజీ వెల్లడించారు. ఎఫ్‌ఐఆర్‌లో లేని మరో ఐదుగురి పేర్లు కూడా విచారణలో బైటకి వచ్చాయన్నారు. కేసు విచారణ ఫలితాన్ని బట్టి సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని డీఐజీ చెప్పారు.

Advertisement
Advertisement