కేంద్ర సహకారం అంతంతే | Sakshi
Sakshi News home page

కేంద్ర సహకారం అంతంతే

Published Sat, Apr 30 2016 3:21 AM

కేంద్ర సహకారం అంతంతే - Sakshi

రూ.15 వేల కోట్లకు రూ.2,800 కోట్లే ఇచ్చారు: సీఎం
సాక్షి, విజయవాడ/సాక్షి, గుంటూరు: రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నామమాత్రంగానే సహకరిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. రాష్ట్రానికి విభజన చట్టం ద్వారా రావాల్సినవి రాలేదన్నారు. ఆయన శుక్రవారం గుంటూరు జిల్లా బ్రహ్మణపల్లిలో నీరు- చెట్టు, నడికుడిలో పంట-సంజీవిని కార్యక్రమాల్లోను, గుంటూరులో జలవనరులు, వ్యవసాయశాఖల ఆధ్వర్యంలో జరిగిన నీరు-ప్రగతి కార్యగోష్టిలోను ప్రసంగించారు. విభజన చట్టం మేరకు కేంద్రం రాష్ట్రానికి రూ.15 వేల కోట్లు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటివరకు రూ.2,800 కోట్లు మాత్రమే ఇచ్చిందన్నారు. చట్టంలో ఉన్నవన్నీ అమలు చేయాలని ఒత్తిడి తెస్తున్నామని చెప్పారు. జూన్ మొదటి వారంలో కృష్ణా డెల్టాకు సాగునీరు ఇచ్చి ముందస్తుగా పంటలు వేసుకునే అవకాశం కల్పిస్తామని పేర్కొన్నారు. రూ.200 కోట్లతో లక్ష ఎకరాల విస్తీర్ణంలో వర్షాభావం ఉన్నచోట రెయిన్ గన్‌లను ఏర్పాటుచేసి ఆ నీటితో పంటల్ని కాపాడతామని చెప్పారు.

Advertisement
Advertisement