వైద్య పరిశోధనలకు అన్నపూర్ణ భౌతికకాయం | Sakshi
Sakshi News home page

వైద్య పరిశోధనలకు అన్నపూర్ణ భౌతికకాయం

Published Mon, May 25 2015 7:58 AM

annapurna dead body for research

పటమట: విజయవాడ పటమట ప్రాంతంలో తారాదేవి హోటల్ అక్కడి వారికి సుపరిచితమే. వృద్ధాప్యంలోనూ పది మంది ఆకలి తీరుస్తూ అన్నపూర్ణగా పేరొందిన వేములపల్లి తారాదేవి(85) కాలేయ సంబంధ వ్యాధితో బాధపడుతూ ఆదివారం మృతి చెందారు. మరణం తర్వాత తన భౌతిక కాయాన్ని పిన్నమనేని సిద్ధార్థ వైద్య కళాశాలకు అందజేయాలని ఆమె ముందుగానే కుటుంబ సభ్యులను కోరారు. దీంతో ఆదివారం ఆమె భౌతిక కాయాన్ని కుటుంబ సభ్యులు వైద్య కళాశాలకు అందజేశారు.

Advertisement
Advertisement