33 మంది ఎర్ర కూలీల అరెస్ట్ | Sakshi
Sakshi News home page

33 మంది ఎర్ర కూలీల అరెస్ట్

Published Tue, Nov 25 2014 2:01 AM

33 మంది ఎర్ర కూలీల అరెస్ట్ - Sakshi

తిరుపతి క్రైం: వేర్వేరు చోట్ల ఎస్‌పీఎఫ్ బల గాలు సాగించిన దాడుల్లో ఎర్రచందనం దుంగలు నరకడానికి వచ్చిన 33 మంది ఎర్ర కూలీలను పోలీసులు అరెస్టు చేశారు. వారిలో ఇద్దరు విద్యార్థులు కూడా ఉన్నారు. ఆ వివరాలను  అర్బన్ జిల్లా క్రైం ఏఎస్పీ సుబ్బారెడ్డి సోమవారం వెల్లడించారు. వేర్వేరు ప్రాంతాల్లో ఎస్టీఎఫ్ బలగాలు సాగించిన దాడుల్లో 33 మంది ఎర్రకూలీలను అదుపులోకి తీసుకుని, 33 దుంగలు, నాలుగు ద్విచక్రవాహనాలు, మూడు కార్లు, లారీ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎమ్మార్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎర్రచందనం అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారం అందడంతో ఎస్టీఎఫ్ బలగాలు, ఎమ్మార్‌పల్లి పోలీసులు దాడులు నిర్వహించారు.

ఈ దాడుల్లో 15 పెద్దవి, 6 చిన్నవి (దుంగలు) , 17 మంది కూలీలను అదుపులోకి తీసుకున్నారు. రేణిగుంట సమీపంలో ఎర్రచందనం తరలి స్తుండగా పోలీసులు మెరుపుదాడులు నిర్వహిం చారు. ఈ దాడుల్లో 12 చిన్న ఎర్రచందనం దుంగలు , 16 మంది ఎర్రచందనం కూలీలు పట్టుబడ్డారని తెలిపారు. ఇందులో ఆంధ్రాలో ఎంఎస్‌సీ చదువుతున్న ఆనందరెడ్డి, తమిళనాడులో ఇంజినీరింగ్ చేస్తున్న సురేష్ కూడా ఉన్నారని తెలిపారు. పట్టుబడ్డవారిలో 8 మంది ఆంధ్రా కూలీలు, మిగతా 25 మంది తమిళనాడుకు చెందిన వారు ఉన్నట్లు వివరించారు. టాస్క్‌ఫోర్‌‌స డీఎస్పీ రవికుమార్, ఏఆర్ డీఎస్పీ ఇలియాస్ బాషా పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement