పట్టిసీమతో పుట్టెడు చిక్కులు: వైఎస్ జగన్ | Sakshi
Sakshi News home page

పట్టిసీమతో పుట్టెడు చిక్కులు: వైఎస్ జగన్

Published Mon, Mar 30 2015 5:37 PM

ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా, రైల్వే జోన్ల ఏర్పాటు, విభజన చట్టంలోని సెక్షన్ 94 అమలుతోపాటు పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం, పట్టిసీమ ప్రాజెక్టు తదితర అంశాలు ప్రధానితో భేటీలో ప్రస్తావనకు వచ్చాయిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఏడుగరు ఎంపీలతో కలిసి సోమవారం సాయంత్రం ప్రధానమంత్రిని ఆయన నివాసంలో కలిసిన అనంతరం జగన్ మీడియాతో మాట్లాడుతూ ప్రాజెక్టుల నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తూ ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటున్న వైనాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు. పోలవరం ప్రాజెక్టును డెడ్ స్టోరేజీలోకి నెట్టి.. పట్టిసీమ ప్రాజెక్టును తెరపైకి తేవడం దారుణమని అన్నారు. పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణానికి జారీచేసిన జీవోలోని అంశాలన్నీ భయం, విస్మయం గొలిపేలా ఉన్నాయని, ఆయా చట్టాలతో భవిష్యత్ లో రాష్ట్రం అనేక ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రధానికి వివరించామన్నారు.

Advertisement
Advertisement