ప్రిన్సిపాల్ సహా పదిమంది దోషులు | Sakshi
Sakshi News home page

ప్రిన్సిపాల్ సహా పదిమంది దోషులు

Published Wed, Jul 30 2014 5:03 PM

తమిళనాడులోని కుంభకోణంలో పాఠశాలలో అగ్నిప్రమాదం జరిగి 94 మంది విద్యార్థులు సజీవ దహనం అయిన కేసులో స్కూలు యజమాని, ప్రిన్సిపల్ సహా పది మందిని కోర్టు దోషులుగా తేల్చింది. నేరపూరిత కుట్ర, హత్య కేసులు వీరిపై రుజువైనట్లు కోర్టు తెలిపింది. వీరికి ఏ శిక్ష విధించేదీ బుధవారమే వెల్లడిచనుంది. 2004లో తంజావూరు జిల్లాలలోని కుంభకోణంలో జరిగిన ఈ అగ్నిప్రమాదం దేశవ్యాప్తంగా పాఠశాలల భద్రతపై చర్చకు దారితీసింది. ఇదే కేసులో ముగ్గురు ఉపాధ్యాయులు సహా 11 మందిని నిర్దోషులుగా విడిచిపెట్టారు. ప్రమాదం సంభవించిన తర్వాత నర్సరీ పిల్లలను వదిలేశారంటూ ఇంతకుముందు వారిని దోషులుగా భావించారు. నాటి ప్రమాదంలో మరణించిన 94 మంది పిల్లల వయసు ఐదు నుంచి తొమ్మిదేళ్ల లోపలే కావడం గమనార్హం. 2004 జూలై నెలలో కుంభకోణంలోని స్కూలు వంటగదిలో మొదలైన మంటలు వెంటనే పైకప్పునకు అంటుకున్నాయి. దాంతో నర్సరీ పిల్లలు మంటల్లో చిక్కుకున్నారు. ప్రమాదంలో 94 మంది పిల్లలు మరణించారు. కనీస అగ్నిమాపక చర్యలు కూడా ఏమీ తీసుకోలేదని తర్వాత జరిగిన విచారణలో తేలింది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలలు తప్పనిసరిగా అగ్నిమాపక శాఖ నుంచి నిరభ్యంతర సర్టిఫికెట్ (ఎన్ఓసీ) తీసుకోవాలన్న నిబంధనను అమలులోకి తెచ్చారు.

Advertisement
Advertisement