ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి | Sakshi
Sakshi News home page

ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి

Published Wed, Apr 17 2024 8:15 AM

సీఎం రేవంత్‌తో డీసీసీబీ చైర్మన్‌ సత్తయ్య - Sakshi

అదనపు కలెక్టర్‌ లింగ్యానాయక్‌

కొడంగల్‌: మహబూబ్‌నగర్‌ లోక్‌సభ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్‌ లింగ్యానాయక్‌ ఆదేశించారు. మంగళవారం పట్టణంలోని తహసీల్దార్‌ కార్యా లయంలో సెక్టోరియల్‌ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో పోలింగ్‌ నిర్వహణకు 352 ఈవీఎం సెట్లు, 394 వీవీ ప్యాడ్లు అవసరమని చెప్పారు. ప్రస్తుతం ఇవి కొడంగల్‌కు చేరినట్లు వివరించారు. ఎన్నికల విధుల్లో 29 మంది సెక్టోరియిల్‌ ఆఫీసర్లు ఉంటారని తెలిపారు. ఎన్నికల అధికారులు ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలన్నారు. సమావేశంలో తహసీల్దార్‌ విజయ్‌కుమార్‌, డీటీ సురేష్‌ పాల్గొన్నారు.

స్ట్రాంగ్‌ రూం పరిశీలన

పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూంను అడిషనల్‌ కలెక్టర్‌ లింగ్యానాయక్‌ మంగళవారం పరిశీలించారు. అక్కడి భద్రతా సిబ్బందితో మాట్లాడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కొడంగల్‌ నియోజకవర్గంలోని మూడు మండలాలకు అవసరమైన ఎన్నికల సామగ్రి వచ్చిందని తెలిపారు.

హస్తం గూటికి రంగారెడ్డి డీసీసీబీ చైర్మన్‌

తుర్కయంజాల్‌: డీసీసీబీ చైర్మన్‌ సత్తయ్య మంగళవారం కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. అంతకు ముందు ఆయన తాండురు ఎమ్మెల్యే బి.మనోహర్‌ రెడ్డితో కలిసి తుర్కయంజాల్‌లోని అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేశారు. తరువాత తొర్రూర్‌లోని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి నివాసానికి వెళ్లి ఆయనను కలిశారు. అనంతరం వారితో వెళ్లి సీఎంను కలిసి కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా సత్తయ్య మాట్లాడుతూ.. పేద ప్రజలకు కాంగ్రెస్‌ పార్టీతోనే న్యాయం సాధ్యం అవుతుందని అన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు రాజీనామా పత్రాన్ని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డికి పంపించారు.

స్ట్రాంగ్‌ రూం వద్ద భద్రతా సిబ్బందితో మాట్లాడుతున్న లింగ్యానాయక్‌

Advertisement
 
Advertisement
 
Advertisement