Python Caught In Chicken Shop At Bhadradri Kothagudem District - Sakshi
Sakshi News home page

చికెన్ షాపులో కొండచిలువ.. షాకైన యజమాని.. తర్వాత ఏం జరిగిందంటే?

Published Wed, Aug 2 2023 10:40 AM

Python Caught In Chicken Shop In Bhadradri Kothagudem District - Sakshi

సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: రోజు అడవిలో ఎలుకలు, ఉడతలు తిని తిని బోర్ కొట్టిందో ఏమో ఒక కొండచిలువ చికెన్ షాప్‌లో దూరింది. చక్కగా అత్తారింటికి వచ్చిన అల్లుడిలా దర్జాలు వలకబోసి బాగా బలిసిన బ్రాయిలర్ కోళ్లను చూసి తన పంట పండిందనుకుంది.

చక్కగా ఓ రెండు కోళ్లను గుటుక్కున మింగి సేదతీరింది. తెల్లారే వచ్చి చూసిన చికెన్ షాపు యజమానికి కొత్త అల్లుడిలా కోళ్ల ఫామ్ లో కొండచిలువు కనిపించింది. వెంటనే ఫారెస్ట్ వారికి సమాచారం ఇవ్వగా వచ్చిన సిబ్బంది తిన్న కోళ్లు కక్కించి బుద్ధిగా ఉండమని మళ్లీ అడవికి పంపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం వినాయకపురంలో జరిగింది ఘటన.
చదవండి: Telangana: నేడు, రేపు వర్షాలు

Advertisement
 
Advertisement
 
Advertisement