కార్మికులకు త్వరలో కొత్త పథకం  | Sakshi
Sakshi News home page

కార్మికులకు త్వరలో కొత్త పథకం 

Published Mon, May 2 2022 1:29 AM

Hyderabad: May Day Celebration In Ravindra Bharathi - Sakshi

గన్‌ఫౌండ్రీ: కార్మికులను ధనవంతులుగా చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఆదివారం రవీంద్రభారతిలో నిర్వహించిన మేడే వేడుకల్లో ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో కార్మికుల సంక్షేమం కోసం పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రైతుబంధు, దళితబంధు తరహాలో కార్మికుల కోసం త్వరలో ఓ కొత్త పథకం తీసుకువస్తామన్నారు.

తాను సైకిల్‌ మీద పాల వ్యాపారం ప్రారంభించానని, నిరంతరం కçష్టపడితేనే జీవితంలో ఉన్నతస్థాయికి చేరుకుంటామని అన్నా రు. మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్, మహమూద్‌ అలీ మాట్లాడుతూ.. దేశ సంపద సృష్టిలో కార్మికుల పాత్ర ఎనలేనిదన్నారు. మేడే సందర్భంగా మం త్రి మల్లారెడ్డి కార్మికుడి వేషధారణలో వచ్చి అందరినీ ఆకట్టుకున్నారు.

అనంత రం మైహోం గ్రూప్, ఎన్‌ఎస్‌ఎన్‌ కృష్ణవేణి షుగర్స్, సాగర్‌ సిమెంట్, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీ, ఎల్‌ అండ్‌ టీ వంటి పలు కంపెనీలకు ఉత్తమ యాజమాన్యం అవార్డులు, 40 మంది కార్మిక విభాగం ప్రతినిధులకు శ్రమశక్తి పురస్కారాలను ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కె.చందర్, రాష్ట్ర పాఠశాల మౌలిక వసతుల కల్పన చైర్మన్‌ రావుల శ్రీధర్‌ రెడ్డి, మర్రి రాజశేఖర్‌ రెడ్డి, కార్మికశాఖ ముఖ్య కార్యదర్శి రాణీ కుముదిని, కమిషనర్‌ అహ్మద్‌ నదీమ్‌ పాల్గొన్నారు.  

పప్పు పహిల్వాన్‌ రాహుల్‌ 
పప్పు పహిల్వాన్‌గా పేరున్న రాహుల్‌గాంధీ వరంగల్‌కు వచ్చి ఏం ఒరగబెడతారని మంత్రి మల్లారెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీ దివాలా తీసిందని, అందుకే రాహుల్‌ను తీసుకొస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆదివారం ఇక్కడి తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్కేవీ నిర్వహించిన మే డే వేడుకల్లో మల్లారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్‌ కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేశారని అన్నారు. అనంతరం ఉత్తమ సేవలందించిన కార్మికులకు శ్రామిక్‌ అవార్డులు అందజేశారు.  

Advertisement
 
Advertisement
 
Advertisement