‘జగనన్న పరిపాలనకు ఆకర్షితులై చేరాం’ | Sakshi
Sakshi News home page

‘జగనన్న పరిపాలనకు ఆకర్షితులై చేరాం’

Published Thu, Apr 18 2024 11:40 AM

- - Sakshi

కంచిలి: ఐదేళ్లపాటు జగనన్న ప్రభుత్వ పరిపాలనకు ఆకర్షితులపై స్వచ్ఛందంగా వైఎస్సార్‌ సీపీలో చేరా మని మండలంలోని జాడుపూడి గ్రామానికి చెందిన వారు అన్నారు. జాడుపూడి పంచాయతీ జాడుపూడి కాలనీకి చెందిన బేడ, బుడగ, పూసల, రజక వర్గాలకు చెందిన వారు టీడీపీని వీడి బుధవారం వైఎ స్సార్‌సీపీలో చేరారు. తమతో పాటు మరో 500 కుటుంబాలు కూడా వైఎస్సార్‌సీపీ పాలనను ఇష్టపడి పార్టీలో చేరాయని వారు పేర్కొన్నారు. వీరిని మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్‌ బల్లిపుట్టుగ లోని తన స్వగృహంలో పార్టీ కండువాలు వేసి ఆ హ్వానించారు. చేరిన వారిలో అయితం వైకుంఠరావు, మర్రిపూడి భైరాగి, గంట మల్లేష్‌, గంట వేమరాజు, మిర్యాల వెంకటరావు, రమణమూర్తి, బోయశెట్టి సన్యాసి, బోయశెట్టి సాయి తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ పైల దేవదాస్‌రెడ్డి, జాడుపూడి పార్టీ నేతలు పలికల జయరాం, జామి నూకయ్య, కృష్ణారావు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement