శాసించే స్థితిలో శ్రీలంక  | Sakshi
Sakshi News home page

శాసించే స్థితిలో శ్రీలంక 

Published Tue, Apr 2 2024 9:27 AM

Sri Lanka In Commanding Position Vs Bangladesh In Second Test - Sakshi

చట్టోగ్రామ్‌: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక మూడో రోజే శాసించే స్థితిలో నిలిచింది. తద్వారా క్లీన్‌స్వీప్‌ దిశగా సాగుతోంది. ఓవర్‌నైట్‌ స్కోరు 55/1తో సోమవారం తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన బంగ్లా 68.4 ఓవర్లలో 178 పరుగులకే కుప్పకూలింది. లంక పేసర్లు అసిత ఫెర్నాండో 4, విశ్వ ఫెర్నాండో, లహిరు కుమార చెరో 2 వికెట్లు తీశారు.

లంకకు తొలి ఇన్నింగ్స్‌లో 353 పరుగుల ఆధిక్యం లభించింది. రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన శ్రీలంక ఆట ముగిసే సమయానికి 25 ఓవర్లలో 6 వికెట్లకు 102 పరుగులు చేసింది. మాథ్యూస్‌ (39 బ్యాటింగ్‌; 3 ఫోర్లు), ప్రభాత్‌ (3 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం లంక 455 పరుగుల భారీ ఆధిక్యంలో ఉంది.   

Advertisement
 
Advertisement
 
Advertisement