సందీప్‌ లమిచానే శిక్ష రద్దు.. వరల్డ్‌కప్‌ జట్టులో చోటు? | Nepal Cricketer Sandeep Lamichhane Acquitted By Patan HC: Report | Sakshi
Sakshi News home page

నేపాల్‌ క్రికెటర్‌ సందీప్‌ లమిచానే శిక్ష రద్దు.. వరల్డ్‌కప్‌ జట్టులో చోటు?

Published Thu, May 16 2024 9:10 AM | Last Updated on Thu, May 16 2024 9:42 AM

Nepal Cricketer Sandeep Lamichhane Acquitted By Patan HC: Report

క్రిమినల్‌ కేసు నుంచి నేపాల్‌ స్టార్‌ క్రికెటర్‌ సందీప్‌ లమిచానేకు హైకోర్టు లో పెద్ద ఊరట లభించింది. ఓ మహిళపై లైంగిక దాడి కేసులో ఖాట్మండు జిల్లా కోర్టు విధించిన 8 ఏళ్ల జైలు శిక్షను పటాన్‌ హైకోర్టు రద్దు చేసింది.

నేపాల్‌ మాజీ కెప్టెన్‌ లమిచానే 2022 ఆగస్టు 21న ఓ మహిళపై లైంగిక దాడికి పాల్పడినట్లుగా వచ్చిన ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఖాట్మండు కోర్టు అతనికి రూ. 3 లక్షలు జరిమానా, మరో రూ. 2 లక్షలు బాధితురాలికి పరిహారంతో పాటు 8 ఏళ్లు జైలు శిక్షను ఖరారు చేసింది.

బెయిల్‌పై బయటికి వచ్చిన లమిచానే కేసును బుధవారం విచారించిన హైకోర్టు కింది కోర్టు శిక్షను రద్దు చేస్తూ తీర్పునిచ్చింది. 23 ఏళ్ల లమిచానే నేపాల్‌ తరఫున 51 వన్డేలు ఆడి 112 వికెట్లు, 52 టి20లు ఆడి 98 వికెట్లు తీశాడు.   

వరల్డ్‌కప్‌ జట్టులో
ఇక సందీప్‌ లమిచానే నిర్దోషిగా తేలడంతో అతడు టీ20 ప్రపంచకప్‌-2024 టోర్నీకి అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ​కాగా, ఇప్పటికే నేపాల్‌ క్రికెట్‌ బోర్డు 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది.అయితే, ఐసీసీ నిబంధనల ప్రకారం మే 25 వరకు జట్టులో మార్పులు చేర్పులకు అవకాశం ఉంది.

టీ20 ప్రపంచకప్‌-2024 కోసం నేపాల్‌ ప్రకటించిన జట్టు
రోహిత్ పౌడెల్ (కెప్టెన్‌), ఆసిఫ్ షేక్, అనిల్ కుమార్ సా, కుశాల్ భుర్టెల్, కుశాల్ మల్లా, దీపేంద్ర సింగ్ ఐరీ, లలిత్ రాజ్‌బన్షి, కరణ్ కెసి, గుల్షన్ ఝా, సోంపాల్ కమీ, ప్రతిస్ జిసి, సందీప్ జోరా, అబినాష్ బోహారా, సాగర్ ధాకల్, కమల్ సింగ్ ఐరీ.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement