టీమిండియా ఆటగాళ్లపై ఐసీసీ ఎలైట్ ప్యానెల్‌లో చోటు దక్కించుకున్న భారత అంపైర్ నితిన్ మీనన్ సంచలన వాఖ్యలు చేశాడు. 50-50 ఉండే ఛాన్సులను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు భారత ఆటగాళ్లు అంపైర్‌లపై ఒత్తడి తీసుకువస్తారని మీనన్ తెలిపాడు. మీనన్ ప్రస్తుతం ఇంగ్లండ్‌లో ఉన్నాడు.
యాషెస్ సిరీస్-2023లో ఆఖరి మూడు టెస్టులకు నితిన్ మీనన్ అంపైర్‌గా వ్యవహరించబోతున్నాడు. యాషెస్ సిరీస్‌లో మీనన్ అంపైర్‌గా వ్యవహరించనుండడం ఇదే తొలి సారి. కాగా గత కొనేళ్లుగా భారత తమ సొంత గడ్డపై ఆడిన చాలా మ్యాచ్‌ల్లో ఆన్‌ఫీల్డ్ అంపైర్‌గా తన బాధ్యతలు నిర్విర్తించాడు. ఐపీఎల్‌లో కూడా మెజారిటీ మ్యాచ్‌ల్లో మీనన్ అంపైర్‌గా కన్పిస్తున్నాడు. ఈ క్రమంలో భారత జట్టుకు వ్యతిరేకంగా అతడు తీసుకున్న కొన్ని నిర్ణయాలు వివాదస్పదమయ్యాయి కూడా.
"భారత జట్టు స్వదేశంలో ఆడుతున్నప్పుడు స్టేడియం మొత్తం ఫుల్ అయిపోతుంది. కాబట్టి తమ అభిమానులు ముందు ఎలాగైనా గెలవడానికి ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో టీమిండియాలో చాలా మంది స్టార్ ఆటగాళ్లు అంపైర్లపై ప్రెషర్ పెట్టాలని ప్రయత్నిస్తారు. 50-50 ఛాన్స్‌లను తమకు అనుకూలంగా తీసుకోవడానికి ప్రయత్నిస్తారు.
కానీ అటువంటి ఒత్తడిలను ఎలా ఎదుర్కొవాలో మాకు బాగా తెలుసు. కాబట్టి వాళ్లేం చేసినా యా ఏకాగ్రత ఏ మాత్రం దెబ్బ తీయలేరు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోగలిగే సామర్థ్యం ఉన్నవారే భారత ఆటగాళ్లు తెచ్చే ఒత్తడిని తట్టుకోగలరు. భారత్‌లో అంపైర్‌గా వ్యవహరించడం ఏ ఎలైట్ ప్యానెల్ అంపైర్‌కైనా సవాలుగా ఉంటుంది. నాకు మొదట్లో అంతగా అనుభవం లేదు. ఐసీసీ ఎలైట్ ప్యానెల్‌లోకి వెళ్లాక చాలా విషయాలు నేర్చుకున్నాను" అని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మీనన్ పేర్కొన్నాడు. కాగా భారత్ నుంచి ఐసీసీ ఎలైట్ ప్యానెల్‌లో చోటు దక్కించుకున్న ఏకైక అంపైర్ నితిన్ మీననే కావడం విశేషం.
చదవండి: Ind vs WI 2023: రోహిత్, కోహ్లి ఆడతారు.. అయితే! వాళ్లిద్దరి అరంగేట్రం ఫిక్స్!
Comments
Please login to add a commentAdd a comment