అవనిగడ్డ వైఎస్సార్‌సీపీ ఇన్‌ఛార్జి కీలక ప్రకటన | Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌తో భేటీ.. అవనిగడ్డ వైఎస్సార్‌సీపీ ఇన్‌ఛార్జి కీలక ప్రకటన

Published Mon, Feb 5 2024 7:15 PM

YSRCP Avanigadda Key Announcement After Met CM Jagan - Sakshi

గుంటూరు, సాక్షి: వైఎస్సార్‌సీపీ ఐదో జాబితాలో అవనిగడ్డ నుంచి ఇంఛార్జిగా అవకాశం అందుకున్నారు డాక్టర్‌ సింహాద్రి చంద్రశేఖర్‌రావు. అయితే.. వయసురీత్యా ఆ బాధ్యతల్ని తన కుమారుడు రామ్‌చరణ్‌కు అప్పగిస్తున్నట్లు ప్రకటించారాయన. సోమవారం సాయంత్రం సీఎంవోలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసిన అనంతరం ఆయన ఈ ప్రకటన చేశారు.  

‘‘అవనిగడ్డ నియోజకవర్గ వైఎస్‌ఆర్‌సీపీ సమన్వయకర్తగా నన్ను నియమించినందుకు సీఎం జగన్‌గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. కానీ నా వయసు రీత్యా నా కుమారుడైన సింహాద్రి రామ్‌చరణ్‌కు నియోజకవర్గ ఇంచార్జి బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఇకనుంచి రామ్‌చరణ్‌ అవనిగడ్డ వైఎస్‌ఆర్‌సీపీ ఇంచార్జిగా ప్రతి గడపకూ తిరుగుతాడు. సీఎం జగన్‌ పేదలకు అందించిన నవరత్నాలను మరింత విస్తృతంగా ప్రజలకు తెలియజేస్తారు. వచ్చే ఎన్నికల్లో అవనిగడ్డ నియోజకవర్గంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తాడు..  

.. మాకు ఈ అవకాశం ఇచ్చిన సీఎం  వైఎస్‌ జగన్‌గారికి మరోకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. అవనిగడ్డ ప్రజలకు మూడు తరాలుగా మా తండ్రి సింహాద్రి సత్యనారాయణ సేవలు అందించారు. ఆ వారసత్వాన్ని నా కుమారుడు రామ్‌చరణ్‌ నిలబెట్టుకుని నియోజకవర్గ ప్రజలకు సేవలందించడానికి సిద్దంగా ఉన్నాడు. మీరంతా గతంలోలా మా కుటంబాన్ని ఆదరించి నా కుమారుడిని ఆశీర్వదించాలని విన్నవించుకుంటున్నా అని పార్టీ కేడర్‌ను, అలాగే ప్రజలను కోరారాయన.

Advertisement
Advertisement