పంజాబ్‌కు 13 పాయింట్ల ఎజెండా | Sakshi
Sakshi News home page

పంజాబ్‌కు 13 పాయింట్ల ఎజెండా

Published Mon, Oct 18 2021 4:24 AM

Navjot Singh Sidhu letter to Sonia Gandhi lists 13 issues - Sakshi

చండీగఢ్‌: పంజాబ్‌ కాంగ్రెస్‌ నేత నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూకి, సీఎం చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీకి మధ్య ఇంకా విభేదాలు కొనసాగుతున్నాయి. రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి ఇదే ఆఖరి అవకాశం అంటూ 13 పాయింట్ల ఎజెండాను సూచిస్తూ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీకి సిద్ధూ లేఖ రాశారు. 2017 ఎన్నికల హామీలన్నీ నెరవేర్చేలా పంజాబ్‌ ప్రభుత్వాన్ని కదిలించాలని ఆ లేఖలో పేర్కొన్నారు. అక్టోబర్‌ 15న రాసిన ఆ లేఖను ఆదివారం సిద్ధూ తన ట్విట్టర్‌ ఖాతాలో షేర్‌ చేశారు.  ఈ 13 పాయింట్ల ఎజెండాపై సోనియాకు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇస్తానని సిద్ధూ వెల్లడించారు. ధనిక రాష్ట్రంగా ఉన్న పంజాబ్‌అప్పుల ఊబిలో కూరుకుపోయిందని పేర్కొన్నారు. డ్రగ్స్‌ అక్రమ రవాణా, వ్యవసాయం, ఉపాధి అవకాశాలు, ఇసుక మాఫియా, విద్యుత్, రవాణా రంగాల్లో సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని కోరారు.

Advertisement
 
Advertisement
 
Advertisement