టోల్‌గేట్ల తొలగింపు.. నీట్‌ రద్దు, డీఎంకే మేనిఫెస్టో విడుదల | Sakshi
Sakshi News home page

CAAపై నిషేధం.. నీట్‌ రద్దు.. తమిళనాడు డీఎంకే మేనిఫెస్టో విడుదల

Published Wed, Mar 20 2024 2:35 PM

Mk Stalin Released Dmk Manifesto - Sakshi

సాక్షి, చెన్నై : వచ్చే లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి తమమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ బుధవారం మేనిఫెస్టోని విడుదల చేశారు. పుదుచ్చేరికి రాష్ట్ర హోదా, నీట్ పరీక్షలపై నిషేధం, ముఖ్యమంత్రికి గవర్నర్‌ను నియమించే అధికారం వంటి ఇతర హామీలను మేనిఫెస్టోలో పేర్కొన్నారు.మేనిఫెస్టోను రూపొందించినందుకు స్టాలిన్‌ తన సోదరి కనిమోళిని  ప్రశంసించారు. ప్రతి జిల్లాకు సంబంధించిన పథకాలపై కనిమొళి అద్భుతమైన మేనిఫెస్టోను రూపొందించారని అన్నారు.   

కాగా మేనిఫెస్టోతో పాటు రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను కూడా స్టాలిన్‌  ప్రకటించారు. అనంతరం సీఎం స్టాలిన్ మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు రూపొందించిన మేనిఫెస్టోలో ఏం చెప్పామో డీఎంకే అది చేస్తుంది. మా నాయకులకు అదే నేర్పాం. ద్రవిడ మోడల్‌లో అమలు చేసిన పథకాలు తమిళనాడు అభివృద్ధిని దేశమంతా వ్యాప్తి చేసేలా చేస్తాయని అన్నారు.  

డీఎంకే మెనిఫెస్టోలో ఏయే అంశాలు ఉన్నాయంటే 

  •  రాష్ట్రాలకు సమాఖ్య హక్కులు కల్పించేందుకు రాజ్యాంగ సవరణ
  • చెన్నైలో సుప్రీం కోర్టు బెంచ్‌ ఏర్పాటు
  • పుదుచ్చేరికి రాష్ట్ర హోదా
  • జాతీయ విద్యా విధానం (NEP) ఉపసంహరణ
  • మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల అమలు
  • ప్రభుత్వ పాఠశాల్లో విద్యార్ధులకు ఉదయం అల్పాహారం సదుపాయం.
  • నీట్‌ బ్యాన్‌.
  • రాష్ట్రంలో టోల్‌ గేట్ల తొలగింపు
  • రాష్ట్రంలో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై నిషేధం
  • ఎల్పీజీ గ్యాస్‌ -500, లీటర్‌ పెట్రోల్‌ రూ.75, డీజిల్‌- రూ.65 అందిస్తూ నిర్ణయం
  • తిరుకురల్‌ను ‘నేషనల్‌ బుక్‌’ గా తీర్చిదిద్దేలా నిర్ణయం
  • దేశానికి తిరిగి వచ్చిన శ్రీలంక తమిళులకు భారత పౌరసత్వం
  • గవర్నర్‌లకు క్రిమినల్ ప్రొసీడింగ్స్ నుండి మినహాయింపునిచ్చే ఆర్టికల్ 361 సవరణ
  • కొత్త ఐఐటీ, ఐఐఎం, ఐఐఎస్‌ఈ, ఐఐఏఆర్‌ఐలు ఏర్పాటుతో పాటు ఇతర హామీలు నెరవేర్చేలా మేనిఫెస్టోని సిద్ధం చేసింది డీఎంకే.

లోక్‌సభ అభ్యర్ధులు వీరే 
లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న లోక్‌ సభ అభ్యర్ధుల జాబితాను ఎంకే స్టాలిన్‌ విడుదల చేశారు. వారిలో డీఎంకే పార్టీలో కీలకనేతలైన కె కనిమొళి, ఎ రాజా తదితరులు ఉన్నారు. 

ఉత్తర చెన్నై - కళానిధి వీరాసామి, దక్షిణ చెన్నై - తమిళచ్చి తంగపాండియన్, సెంట్రల్ చెన్నై - దయానిధి మారన్, శ్రీపెరుంబత్తూరు - టీఆర్ బాలు, అరకోణం - జగత్రాచహన్, వెల్లూరు - కంధీర్‌లను బరిలోకి దించాలని పార్టీ నిర్ణయించింది.

వీరితో పాటు తిరువనమలై -  అన్నాదురై, ఆరణి - ధరణి, సేలం - సెల్వగపతి, ఈరోడ్ - ప్రకాష్, నీలగిరి - ఏ రాజా, కోవై - గణపతి రాజ్‌కుమార్, పెరంబలూరు - అరుణ్ నేరు, తంజావూరు - మురసోలి, తేని - తంగ తమిళ్ సెల్వం, తుత్తుకుడి - కనిమొళి, తెంకాసి - రాణి,  కళ్లకురిచి - మలైయరసన్.

Advertisement

తప్పక చదవండి

Advertisement