చంద్రబాబుకు మంత్రి జోగి రమేష్‌ సవాల్‌ | Sakshi
Sakshi News home page

చంద్రబాబుకు మంత్రి జోగి రమేష్‌ సవాల్‌

Published Thu, Jan 25 2024 8:58 PM

Minister Jogi Ramesh Challenges Chandrababu - Sakshi

సాక్షి, కృష్ణా జిల్లా: పెనమలూరులో నాపై పోటీ చేసే దమ్ముందా? అంటూ చంద్రబాబుకు సవాల్‌ విసిరారు మంత్రి జోగి రమేష్‌. కంకిపాడులో పెనమలూరు నియోజకవర్గ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు సర్వేలు కూడా చేయించుకున్నాడని, ఎవరు పోటీ చేసినా గెలిసేది తానేనన్నారు. ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా జగన్‌ను ఎదుర్కోలేరు. ప్రతిపక్షాలను కృష్ణా నదిలో కలిపేస్తామన్నారు.

‘‘ప్రజల గుండెల్లో జగన్ నిలిచిపోయారు. ఢిల్లీలో కాంగ్రెస్ పీఠాన్ని వణికించిన ధీరుడు సీఎం జగన్‌. ఆయనపై సోనియా, రాహుల్‌ కుట్రలు పన్నారు. చంద్రబాబు వెన్నుపోటు పొడుస్తాడు. కాంగ్రెస్ ముందుపోటు పొడుస్తుంది. వచ్చే ఎన్నికల్లో 175కు 175 స్థానాలు గెలుస్తాం. పెనమలూరు గడ్డ వైఎస్సార్‌సీపీ అడ్డా’’ అని మంత్రి పేర్కొన్నారు.

ఇదీ చదవండి: షర్మిలకు ఏ అన్యాయం చేశామో.. ఆమె చెప్పాలి: సజ్జల

Advertisement
 
Advertisement
 
Advertisement