కాంగ్రెస్‌.. దద్దమ్మ ప్రభుత్వం | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌.. దద్దమ్మ ప్రభుత్వం

Published Sat, May 4 2024 6:21 AM

Kishan Reddy Comments On CM Revanth Reddy

అసెంబ్లీ ఎన్నికలప్పుడు తప్పుడు హామీలతో వెన్నుపోటు

మళ్లీ ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలకు అసంబద్ధ హామీలా? 

కేంద్ర పథకాలపై దమ్ముంటే సీఎం రేవంత్‌రెడ్డి చర్చకు రావాలి 

కేంద్రం చేస్తున్నవి కూడా కాంగ్రెస్‌ చేస్తున్నట్టు చూపి లబ్ధి పొందే కుట్ర 

సిగ్గులేకుండా ట్రిపుల్‌ ఆర్‌ను తన ఖాతాలో వేసుకున్నారు 

రైల్వేల గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్‌ నేతలకు లేదు 

కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి  

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో లెక్కలేనన్ని హామీలిచ్చి వెన్నుపోటు పొడిచిన కాంగ్రెస్‌ పార్టీ ఇప్పుడు మళ్ళీ అసంబద్ధ వాగ్దానాలతో లోక్‌సభ ఎన్నికలకు మేనిఫెస్టో విడుదల చేసిందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్‌లో శుక్రవారం కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మేనిఫెస్టోలో కాంగ్రెస్‌ కల్ల»ొల్లి హామీలతో ప్రజలను మళ్లీ మోసం చేసేందుకు ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు.

వంద రోజుల్లో గ్యారంటీలు అమలు చేయలేని దద్దమ్మ ప్రభుత్వానికి.. ప్రజలను వెన్నుపోటు పొడిచిన కాంగ్రెస్‌ పారీ్టకి ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఓట్లడిగే నైతిక హక్కు లేదన్నారు. ఉచిత విద్యుత్‌ ఎక్కడా అమలు జరగడం లేదనీ, అందరికీ కరెంట్‌ బిల్లులు వస్తున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఇప్ప టికే ప్రజల్లో తిరిగే పరిస్థితి లేదన్న కిషన్‌రెడ్డి.. ఊళ్ల లో ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్‌ నాయకులను హామీ ల అమలు ఏమైందంటూ ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు. కేంద్రం అమలు చేస్తున్న పథకాలపై మాట్లాడేందుకు దమ్ముంటే సీఎం రేవంత్‌ రెడ్డి చర్చకు రావాలని సవాల్‌ చేశారు. అలాగే రైల్వేల కో సం యూపీఏ హయాంలో ఎన్ని నిధులు ఇచ్చారో.. మోదీ వచ్చాక ఎన్ని నిధులు వచ్చాయో చర్చకు రావాలని రేవంత్‌రెడ్డిని కిషన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.  

చేతి గుర్తు బదులు గాడిద గుడ్డు పెట్టుకున్నారేమో? 
కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోలో ఎలాంటి పసలేదని విమర్శించిన కిషన్‌రెడ్డి ఎన్నికలకు ముందే కాంగ్రెస్‌ కాడి కింద పడేసి చేతులు ఎత్తేసిందని ఎద్దేవా చేశారు. ’’గ్యారంటీల పేరుతో గాడిద గుడ్డు ఇచ్చారు. తమ ఎన్నికల చిహ్నం చేతి గుర్తు మార్చుకొని గాడిద గుడ్డు గుర్తు పెట్టుకున్నారేమోనని రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు’ అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ నాయకులు రీజినల్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణాన్ని సిగ్గు లేకుండా తమ ఖాతాలో వేసుకుంటున్నారని ధ్వజమెత్తిన కిషన్‌రెడ్డి.. దానికి కర్త కర్మ క్రియ బీజేపీనే అని స్పష్టం చేశారు. ప్రజావాణి దరఖాస్తులు ఎన్ని పరిష్కరించారని నిలదీశారు. ప్రజావాణిలో కనీసం సీఎం ఒక్క రోజు కూడా పాల్గొనలేదని గుర్తు చేశారు. 

రాష్ట్రంలో ఏం మార్పు వచ్చింది? 
తెలంగాణలో ఏ మార్పు మొదలైందని హైదరాబాద్‌లో బోర్డులు పెడుతున్నారని కిషన్‌రెడ్డి నిలదీశారు. కేసీఆర్‌ కుటుంబ పాలన పోయి సోనియా కుటుంబ పాలన వచి్చందని ఆరోపించారు. ‘28,942 ఉద్యోగాలు భర్తీ చేసినట్లు కాంగ్రెస్‌ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. గత ప్రభుత్వంలో పెండింగ్‌లో ఉంచిన నియామకాలకు సంబంధించి అపాయింట్‌మెంట్‌ లెటర్స్‌ ఇచ్చి కాంగ్రెస్‌ ఖాతాలో వేసుకుంటున్నారని ఆరోపించారు. 

అవన్నీ ఏమయ్యాయి? 
తెలంగాణలో రేషన్‌ కార్డులు ఇస్తున్నారా? సింగరేణి కార్మికులకు కోటి బీమా కల్పించారా ? ఒక్క మహిళ సంఘానికైనా వడ్డీ లేని రుణం ఇచ్చారా’అని కిషన్‌రెడ్డి నిలదీశారు. ఇప్పటికీ ఒక్క తెల్లరేషన్‌ ఇవ్వకపోగా ఇచి్చనట్లు హోర్డింగులతో అడ్వర్టైజ్‌మెంట్లతో ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. వంద రోజుల్లో 5 గ్యారంటీలు అమలు చేశామంటూ, దావోస్‌ నుంచి రూ.40 ,232 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామంటూ, హోంగార్డులు, జర్నలిస్టులకు రూ. 5 లక్షల బీమా కల్పించినట్లు మెట్రో పిల్లర్లపై హోర్డింగులతో అబద్ధపు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అప్పుడు కేసీఆర్‌ హామీలిచ్చి మసిపూసి మారేడుకాయ చేసేవారు.. ఇప్పుడు రేవంత్‌ రెడ్డి అయిదు నెలల్లోనే కాంగ్రెస్‌ అవినీతి మార్కును చూపించారని ధ్వజమెత్తారు. ఎన్నికలకు ముందే బీఆర్‌ఎస్‌ చేతులెత్తేసిందని ఎద్దేవా చేశారు.  

బీజేపీలో ఐటీ కంపెనీల యజమానులు చేరిక 
శుక్రవారం పార్టీ కార్యాలయంలో ఐటీ కంపెనీ యజమాని ఊరంగంటి వెంకటేష్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో పలువురు ఐటీ కంపెనీల యజ మానులు, ఉద్యోగులు, వరంగల్‌ జిల్లాకు చెందిన దగ్గు విజేందర్‌రావు ఆధ్వర్యంలో పలు వురు బీజేపీలో చేరారు. వారికి కండువా కప్పి కిషన్‌రెడ్డి పారీ్టలోకి ఆహా్వనించారు. పార్టీలో చేరిన వారిలో బీఆర్‌ఎస్‌ నేతలు ఉన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement