‘బీజేపీ ఎమ్మెల్యేలను టచ్ చేస్తే రేవంత్‌ ప్రభుత్వం కూలిపోతుంది’ | Sakshi
Sakshi News home page

బీజేపీ ఎమ్మెల్యేలను టచ్ చేస్తే రేవంత్‌ ప్రభుత్వం కూలిపోతుంది: ఏలేటి

Published Sat, Mar 30 2024 1:36 PM

Alleti Maheshwar Reddy Serious On Congress Govt - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో బీజేపీ ఎమ్మెల్యేలను టచ్‌ చేస్తే కాంగ్రెస్‌ ప్రభుత్వం కూలడం ఖాయమని హెచ్చరించారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి. అలాగే, తాము గేట్లు ఎత్తితే 48 గంటల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉండదంటూ సంచలన కామెంట్స్‌ చేశారు. 

కాగా, ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి శనివారం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌ రెడ్డి చేస్తున్న వసూళ్ల చిట్టా మా దగ్గర ఉంది. హైదరాబాద్‌ డబ్బులు దేశ రాజకీయాల కోసం కాంగ్రెస్‌ వినియోగిస్తోంది. రంజిత్‌ రెడ్డిపై గతంలో రేవంత్‌ చేసిన ఆరోపణలు ఏమయ్యాయి. అప్పుడు రంజిత్ రెడ్డి అవినీతి చేశారని చెప్పిన రేవంత్ ఇప్పుడు ఎన్నికల్లో ఆయనకు ఓటు వేయాలని ఎలా అడగతారు?.

రాష్ట్రంలో బీజేపీ ఎమ్మెల్యేలను టచ్‌ చేసి చూడండి ఏం జరుగుతుందో మీకే తెలుస్తుంది. మా పార్టీ గేట్లు ఎత్తితే 48 గంటల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉండదు. నితిన్‌ గడ్కరీ వద్దకు వెళ్లి షిండే పాత్ర పోషిస్తానని కోమటిరెడ్డి అన్నది వాస్తవం. అయితే, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై ఎవరికీ నమ్మక​ం లేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఆయనతో లేడు అంటూ కామెంట్స్‌ చేశారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement