పరిశీలకుల సమావేశంలో మల్లు రవితో మాట్లాడుతున్న మాణిక్ రావ్ ఠాక్రే
సాక్షి, హైదరాబాద్: రానున్న ఎన్నికల్లో కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలకు ప్రాధాన్యమివ్వాలని కమ్మ రాజకీయ ఐక్య వేదిక విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు గురువారం గాందీభవన్‌లో కమ్మ ఐక్య వేదిక ప్రతినిధులు రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్ ఠాక్రేను కలసి వినతిపత్రం సమర్పించారు. కాంగ్రెస్ పార్టీ లోని కమ్మ నేతలకు తగిన అవకాశాలు కల్పించాలని అందులో కోరారు.
పరిశీలకుల భేటీ..
ఏఐసీసీ నియమించిన పార్లమెంటరీ పరిశీలకుల సమావేశం ఠాక్రే అధ్యక్షతన గాందీభవన్‌లో జరిగింది. ఈ సమావేశంలో పరిశీలకులు దీపాదాస్‌మున్షీ, జ్యోతిమణి, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లురవి, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
పార్లమెంటరీ స్థానాల వారీగా తమ పర్యటనల సందర్భంగా దృష్టికి వచ్చిన అంశాలను, ఆయా స్థానాల పరిధిలో పార్టీ పరిస్థితిని ఈ సందర్భంగా పరిశీలకులు ఠాక్రేకు వివరించారు. ఈ మేరకు పార్లమెంటు స్థానాల వారీగా ప్రత్యేక నివేదికను తయారుచేసి అధిష్టానానికి పంపాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment