వాలెంటైన్స్‌ డే వేళ... కొన్ని సరదా సంగతులు! | Sakshi
Sakshi News home page

Valentines Day: వాలెంటైన్స్‌ డే వేళ... కొన్ని సరదా సంగతులు!

Published Tue, Feb 13 2024 11:50 AM

valentines day intresting facts - Sakshi

ఫిబ్రవరి 14... వాలెంటైన్స్‌ డే.. అంటే ప్రేమికుల రోజు. ఆ రోజున ప్రేమికులంతా ఆనంద డోలికల్లో మునిగితేలుతుంటారు. ప్రేమ ఊసులు చెప్పుకుంటారు. అయితే వాలెంటైన్స్‌ డేకు సంబంధించిన కొన్ని ఆసక్తికర సంగతులు చాలామందికి తెలియవు. వాటిపై ఇప్పుడు ఓ లుక్కేద్దాం. 

  • మొదటి వాలెంటైన్ డే వేడుక 15వ శతాబ్దంలో ఫ్రాన్స్‌లో జరిగింది. మొదటి అధికారిక వాలెంటైన్స్ డే పారిస్‌లో జరిగిందని చెబుతారు. ఫిబ్రవరినాటి మధ్యస్థ రోజుల్లో పక్షుల సంభోగంలో పాల్గొంటాయట. అందుకే ఇది శృంగారాన్ని జరుపుకోవడానికి తగిన సమయమని అంటుంటారు.
  • వాలెంటైన్స్ డే నాడు ప్రతి సంవత్సరం 145 మిలియన్ గ్రీటింగ్ కార్డ్‌లను పరస్పరం ఇచ్చిపుచ్చుకుంటారు. యునైటెడ్ స్టేట్స్‌లో అత్యధిక వాలెంటైన్స్‌ గ్రీటింగ్‌ కార్డులు పంచుకుంటారట. 
  • పెంపుడు జంతువుల యజమానులలో 25 శాతం మంది వాలెంటైన్స్‌ డే సందర్భంగా తమ పెంపుడు జంతువులకు వాలెంటైన్స్ డే బహుమతులు ఇస్తారు.
  • అంటే వాలెంటైన్స్‌ డే.. కేవలం మనుషులకే కాదు కుక్కలు, పిల్లులు,పక్షులు, ఇతర పెంపుడు జంతువులకు సంబంధించినది కూడా.
  • హృదయాకార మిఠాయిలను 1800లో తయారుచేశారట. బోస్టన్ ఫార్మసిస్ట్ ఆలివర్ చేజ్ వీటిని తయారుచేసే ప్రక్రియను సులభతరం చేయడానికి ఒక యంత్రాన్ని కనుగొన్నాడు. 
  • ప్రతి సంవత్సరం ఎనిమిది బిలియన్ల హృదయ సంభాషణలు రూపొందిస్తారట. వివిధ రకాల క్యాండీలపై క్లాసిక్ రొమాంటిక్ పదబంధాలలో  ‘బి మైన్’, ‘క్యూటీ పై’ ‘ఐ యామ్ యువర్స్’ అనే అక్షరాలను ముద్రిస్తారు.  
  • వాలెంటైన్స్ డే నాడుప్రేమికులు 58 మిలియన్ పౌండ్ల విలువైన చాక్లెట్లు, మిఠాయిలను కొనుగోలు చేస్తారట.
  • వాలెంటైన్స్ డే మిఠాయి అమ్మకాలలో గుండె ఆకారంలో ఉండే చాక్లెట్ బాక్స్‌లు దాదాపు 10శాతం ఉంటాయి.
  • 1850లో క్యాడ్‌బరీ కంపెనీ చాక్లెట్‌లతో కూడిన బాక్స్‌ రూపొందించింది. దశాబ్ధకాలం తరువాత మొదటి గుండె ఆకారపు చాక్లెట్‌ బాక్స్‌ను తయారయ్యింది. 
  • మొదటి వాలెంటైన్స్‌ డే గ్రీటింగ్‌ కార్డు జైలు నుండి పంపించారు. డ్యూక్ ఆఫ్ ఓర్లీన్స్ 15వ శతాబ్దం ప్రారంభంలో ఖైదీగా మారినప్పుడు మొదటి వాలెంటైన్ లేఖ రాశాడు. దానిలో ఒక కవిత రాసి, తన రెండవ భార్యకు పంపాడు. అయితే అతను జైలులో ఉన్నందున ఆ కవితకు ఆమె నుంచి వచ్చిన స్పందనను అతను చూడలేదు.
  • అత్యధికంగా టీచర్లు వాలెంటైన్‌డే గ్రీటింగులను అందుకుంటారు. వాలెంటైన్స్ డే కోసం 250 మిలియన్ల గులాబీలను పండిస్తారు!
  • రోమన్ ప్రేమ దేవత వీనస్‌కు ఇష్టమైనవి ఎరుపు రంగు గులాబీలు. ఇవి శృంగారాన్ని, ప్రేమను సూచిస్తాయి.

Advertisement
Advertisement