లక్నో: ఉమేష్ పాల్ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న గ్యాంగ్‌స్టర్ పొలిటీషియన్ అతిక్ అహ్మద్‌ను బుధవారం గుజరాత్ సబర్మతి జైలు నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ జైలుకు తరలించారు అధికారులు. ఈ సమయంలో పలు మీడియా సంస్థలు పోలీసుల వాహనాలను అనుసరించాయి. అతిక్ అహ్మద్‌ను సురక్షితంగా జైలుకు తీసుకెళ్లేంత వరకు కెమెరాలతో రికార్డు చేశాయి.
దీంతో తాను ఇంకా ప్రాణాలతో ఉన్నానంటే మీడియానే కారణమని అతిక్ అహ్మద్ అన్నారు. అందుకు మీడియా ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. మీరు భయపడుతున్నారా అని అడిగిన ఓ ప్రశ్నకు అతడు ఈమేరుక సమాధానం ఇచ్చాడు.
అలాగే ఉమేష్ పాల్ హత్య కేసుతో మీకున్న సంబంధం ఏంటి? మీ కుటుంబం పరిస్థితి ఎలా ఉంది? అని మీడియా అడగ్గా.. తన ఫ్యామిలీ నాశనం అయిందని అతిక్ బదులిచ్చాడు. జైలులో ఉన్న తనకు కుటుంబసభ్యులు ఎలా ఉన్నారో.. ఎక్కడ ఉంటున్నారో ఎలా తెలుస్తుందని అన్నాడు.
Rajasthan | Prayagraj Police convoy taking criminal-turned-politician-mafia Atiq Ahmed from Sabarmati Jail to Prayagraj, to present him in a murder case, took a halt in Bundi. pic.twitter.com/ntwPenvf6v
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) April 11, 2023
2006లో ఉమేష్ పాల్ కిడ్నాప్ కేసులో అతిక్ అహ్మద్‌తో పాటు మరో ఇద్దరు దోషులుగా తేలారు. వీరికి న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. అతిక్ సోదరుడు ఖలీద్ అజీమ్‌తో పాటు మరో ఆరుగురిని కోర్టు నిర్దోషులుగా విడుదల చేసింది. 2006లోనే జరిగిన బీఎస్పీ ఎమ్మెల్యే రాజు పాల్ హత్య ఘటనలో ఉమేష్ పాల్ కీలక సాక్షిగా ఉన్నాడు.
అయితే ఈ ఏడాది ఫిబ్రవరి 24న ఉమేష్ పాల్ ప్రయాగ్ రాజ్‌లోని తన నివాసం ఎదుట దారుణ హత్యకు గురయ్యాడు. కొంతమంది దుండగులు ఆయనను తుపాకులతో కాల్చిచంపారు. అతిక్ అహ్మద్‌తో పాటు అతని సోదరుడు అశ్రఫ్‌లే ఈ హత్యకు కుట్ర పన్నినట్లు ఆరోపణలున్నాయి.
#WATCH | Bundi, Rajasthan: "My family has been ruined...I was in jail what will I know about it (Umesh Pal murder case)," says criminal-turned-politician-mafia Atiq Ahmed while being taken from Sabarmati Jail to Prayagraj pic.twitter.com/LTc869VdxQ
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) April 11, 2023
చదవండి: నేను ఇంకా ప్రాణాలతో ఉన్నానంటే మీరే కారణం.. థ్యాంక్స్: గ్యాంగ్‌స్టర్
Comments
Please login to add a commentAdd a comment