‍‘ప్రజ్వల్‌ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్‌డి కుమారస్వామి | Sakshi
Sakshi News home page

‘‍ప్రజ్వల్‌ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్‌డి కుమారస్వామి

Published Tue, May 7 2024 8:44 PM

H​d Kumaraswamy Responded On Prajwal Revanna Videos Issue

బెంగళూరు: సంచలనం రేపిన జేడీఎస్‌ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ లైంగిక దౌర్జన్య వీడియోలపై జేడీఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి స్పందించారు. అభ్యంతరకర వీడియోలున్న 25 వేల పెన్‌డ్రైవ్‌లను పంచడం వెనుక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ ఉన్నారని మండిపడ్డారు. 

తొలుత ఏప్రిల్‌ 21న బెంగళూరు రూరల్‌ నియోజకవర్గంలో ఒక పెన్‌డ్రైవ్‌ను రిలీజ్‌ చేశారన్నారు. వాట్సాప్‌ ఛానల్‌ సృష్టించి మరీ వీడియోలు కావాల్సిన వారు ఛానల్‌ను ఫాలో అవ్వాలని కోరారని చెప్పారు. దీనిపై ఏప్రిల్‌ 22న తమ పార్టీ పోలింగ్‌ ఏజెంట్‌  ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి ఫిర్యాదు చేశాడన్నారు. 

సిట్‌తో న్యాయం జరుగుతుందన్న నమ్మకం తనకు లేదన్నారు. తప్పు చేసిన వారికి చట్టం ప్రకారం పడాల్సిందేనని స్పష్టం చేశారు. వీడియోలు పంచినవారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. పోలీసు అధికారుల సాయంతోనే పెన్‌డ్రైవ్‌లను పంచినట్లు తమకు సమాచారం ఉందన్నారు. జేడీఎస్‌ ఎంపీ అభ్యర్థులు ముగ్గురు ఓడిపోతారన్న సీఎం సిద్ధరామయ్య వ్యాఖ్యలు గుర్తొస్తే ఇప్పడు అనుమానం వేస్తోందన్నారు.   

Advertisement
 
Advertisement
 
Advertisement