ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మనీలాండరింగ్ కేసులో అరెస్టై.. జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రైవేట్ పర్సనల్ సెక్రటరీ భిభవ్ కుమారుపై వేటు పడింది. ఢిల్లీ డైరెక్టరేట్ ఆప్ విజిలెన్స్ గురువారం ఆయన్ను విధుల నుంచి తొలగించింది. ఈ మేరకు విజిలెన్స్ స్పెషల్ సెక్రటరీ వైవీవీజే రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు. భిభవ్ కుమార్‌పై నమోదైన కేసు, తాత్కాలిక నియామకానికి సంబంధించి సెంట్రల్ సివిల్ సర్వీస్ నిబంధనలను ఉల్లంఘించి నియమించినందకు ఆయన విధులను రద్దు చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
2007లో తన విధలు నిర్వమించకుండా అడ్డుకుని, బెదిరింపులకు పాల్పడటంతో భిభివ్ కుమార్‌తో పాటు మరో ముగ్గురిపై నోయిడా డెవలప్‌మెంట్ అథారిటీలో పని చేసే మహేష్ పాల్ అనే ప్రభుత్వ అధికారి కేసు నమోదు చేశాఉ. దీంతో పోలీసులు వారిపై ఎఫ్‌ఐఆర్‌బుక్ చేశారు. అయితే ఈ కేసుకు సంబంధించి విచారణ ఇంకా పెండింగ్‌లోనే ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో పరిపాలనపరమైన చర్యలో భాగంగా భిభవ్ కుమార్‌ను సీఎం కేజ్రీవాల్ పర్సనల్ సెక్రటరీగా తొలగించారు.
మరోవైపు.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సోమవారం భిభవ్ కుమార్‌ను ఈడీ ప్రశ్నించింది. అదే విధంగా మనీలాండరింగ్ యాక్ట్ కింద భిభవ్ కుమార్ వద్ద స్టేట్‌మెంట్ రికార్డు చేసినట్లుగా ఈడీ పేర్కొంది. కేజ్రీవాల్ తన అరెస్ట్ అక్రమమని, ఈడీ అరెస్ట్‌ను రద్దు చేయాలని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. అనంతరం ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. ఈ పిటిషన్‌పై విచారణను పరిశీలిస్తామని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment