తెలుగు చిత్ర పరిశ్రమలో క్రమశిక్షణ లేదు: సుమన్‌ సంచలన వ్యాఖ్యలు | Sakshi
Sakshi News home page

Actor Suman: తెలుగు చిత్ర పరిశ్రమలో క్రమశిక్షణ లేదు

Published Mon, May 30 2022 8:58 PM

Suman Shocking Comments On Tollywood Makers At Dasari Narayana Rao Memorial Event - Sakshi

తెలుగు చిత్ర పరిశ్రమలో క్రమశిక్షణ లేదని సీనియర్‌ నటుడు సుమన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం(మే 30) దర్శకరత్న దాసరి నారాయణరావు వర్థంతి సందర్భంగా ఇండస్ట్రీ ప్రముఖులు ఆయనను గుర్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను స్మరించుకుంటూ నిర్వహించిన ఓ కార్యక్రమానికి టాలీవుడ్‌ ప్రముఖులతో పాటు నటుడు సుమన్‌ కూడా పాల్గొన్నారు.

చదవండి: అదిరిపోయిన అనన్య, విజయ్‌ హుక్‌ స్టెప్‌, వీడియో చూశారా?

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాసరిగారు ఇండస్ట్రీ పెద్దగా అందరి సమస్యల గురించి ఆలోచించేవారని గుర్తు చేశారు. ‘ముఖ్యంగా ఆయన బయ్యర్స్‌ గురించి ఆలోచించేవారు. ఒక సినిమా ప్లాప్‌ అయితే తర్వాత సినిమాను ఫ్రీగా చేసి బయ్యర్స్‌ను కాపాడేవారు. కానీ ప్రస్తుత నిర్మాతలు బయ్యర్స్‌ గురించి ఆలోచించడం లేదు. మేకర్స్‌ వల్ల బయ్యర్స్‌ నష్టపోతున్నారు. వారి తీరుతో బయ్యర్స్‌ సంతోషంగా ఉండటం లేదు. కోట్టకు కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్నారు.

చదవండి: అలాంటివి విని విసిగిపోయాను, నా వ్యక్తిత్వం అది కాదు: రాధిక ఆప్టే

సినిమా హిట్‌ అవుతుందనే నమ్మకంతో బయ్యర్స్‌ కొంటున్నారు. ఒకవేళ ఆ సినిమా ప్లాప్‌ అయితే నష్టపోయేది వారే. అసలు బయ్యర్ల గురించి ఆలోచించే వారే లేరు. సినిమా షూటింగ్స్‌లో సమయపాలన అసలు లేదు. నిర్మాతకు అదనపు భారం కలిగేలా మేకర్స్‌ ఉన్నారు. ఇది నేను ఆవేశంతో మాట్టాడుతున్నాను అనుకున్నా.. ఇది మాత్రం నిజం’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. దీంతో సుమన్‌ చేసిన ఈ కామెంట్స్‌ ఇండస్ట్రీలో చర్చనీయాంశమయ్యాయి. 

Advertisement
 
Advertisement
 
Advertisement