సాయిపల్లవికి రికార్డ్ రెమ్యునరేషన్.. 'రామాయణ' కోసం అన్ని కోట్లా? | Sai Pallavi Remuneration For Ramayan Movie Latest Update, Interesting Deets Inside - Sakshi
Sakshi News home page

Sai Pallavi Remuneration: ఒక్కసారిగా పారితోషికం పెంచేసిందిగా.. కారణమేంటంటే?

Published Sat, Apr 13 2024 6:52 AM

Sai Pallavi Remuneration For Ramayan Movie Latest Update - Sakshi

ప్రస్తుత జనరేషన్ లో నేచురల్ బ్యూటీ అంటే సాయిపల్లవినే. ఎందుకంటే చాలా సాధారణమైన పాత్రల్లో చేస్తూనే సూపర్ హిట్స్ కొట్టింది. ప్రస్తుతం హిందీలో భారీ బడ్జెట్ తో తీస్తున్న 'రామాయణ' మూవీలో నటిస్తోంది. అయితే ఇందులో నటిస్తున్నందుకు కళ్లుచెదిరే రెమ్యునరేషన్ తీసుకుంటుందనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి రాబోతున్న అనసూయ లేటెస్ట్ మూవీ)

'ప్రేమమ్' అనే మలయాళ మూవీతో హీరోయిన్ గా మారిన సాయిపల్లవి.. ఆ తర్వాత 'ఫిదా'తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. పలు సినిమాల్లో నటించి హిట్స్ కొట్టింది. చివరగా 'విరాటపర్వం'లో కనిపించింది. ఇది వచ్చి నాలుగేళ్లుపైనే అయిపోయింది. అయితే గత రెండేళ్లుగా నటనకు బ్రేక్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఈ మధ్యే మళ్లీ బిజీగా మారుతోంది. ప్రస్తుతం తమిళంలో ఓ మూవీ చేస్తున్న సాయిపల్లవి.. హిందీలో ఆమిర్ తనయుడు జునైద్ ఖాన్ హీరోగా పరిచయమవుతున్న సినిమా చేస్తోంది.

అలానే రణ్ బీర్, యష్ తదితరులు నటిస్తున్న 'రామాయణ'లోనూ సీత పాత్ర చేయబోతుంది. త్వరలో ఈ ప్రాజెక్టుని అధికారికంగా ప్రకటించబోతున్నారు. సాధారణంగా ఒక్కో సినిమాకు రూ.2 కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే సాయిపల్లవి.. మూడు భాగాలుగా తీస్తున్న 'రామాయణ' కోసం మాత్రం రూ.10-15 కోట్ల వరకు తీసుకుంటుందని టాక్. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం నయనతారని దాటేసి రికార్డ్ సృష్టించినట్లే. సీత పాత్రకు ఉన్న ప్రాధాన్యం దృష్టానే తన పారితోషికాన్ని సాయిపల్లవి అమాంతం పెంచేసిందని అంటున్నారు.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన రెండు హిట్ సినిమాలు.. స్ట్రీమింగ్ అందులోనే)

Advertisement
 
Advertisement
 
Advertisement