Rajamouli Shares Special Video On Occassion Of Prasad Imax Completes 20 Years, Video Goes Viral - Sakshi
Sakshi News home page

Rajamouli Video On Prasad Imax: నువ్వు కేవలం సినిమానే కాదు.. నా తరగతి గది కూడా: రాజమౌళి ఎమోషనల్ ట్వీట్

Published Thu, Jul 27 2023 5:59 PM

Rajamouli Special Tweet On Prasad Imax Completes 20 Years - Sakshi

తెలుగు సినిమాను ప్రపంచానికి పరిచయం చేసిన దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో టాలీవుడ్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చాడు. సినీ ప్రపంచంలో మన తెలుగు చిత్రాలకు సుస్థిరమైన స్థానం కల్పించాడు. సినిమాలతో తనకున్న అనుబంధాన్ని ఎప్పుడు ఏదో ఒకరూపంలో వ్యక్తం చేస్తుంటారు. తాజాగా  రాజమౌళి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇంతకీ ఆ ట్వీట్‌లో ఏముందో తెలుసుకుందాం.

(ఇది చదవండి: అల్లు అర్జున్‌ సినిమాకు నో చెప్పిన శ్రీలీల... కారణం ఇదేనా?)

హైదరాబాద్‌లో ఫస్ట్‌ డే ఫస్ట్ షో అనగానే అందరికీ ఠక్కున గుర్తొచ్చే మల్టీప్లెక్స్ పేరు ప్రసాద్ ఐమాక్స్. సినీ ప్రేక్షకుల గుండెల్లో ఆ మల్టీప్లెక్స్‌కు ఓ చరిత్ర ఉందనడంలో సందేహం లేదు. శుక్రవారం వచ్చిందంటే చాలు ఓ పండుగ వాతావరణం కనిపిస్తుంది. అంతలా సినీ ప్రియులకు వినోదం అందించడంలో ముందున్న ప్రసాద్ ఐమాక్స్ స్థాపించి ఇరవై ఏళ్లవుతోంది. ఈ సందర్భంగా రాజమౌళి ఓ వీడియోను షేర్ చేస్తూ తన అభిమానాన్ని చాటుకున్నారు. 

రాజమౌళి తన ట్వీట్‌లో రాస్తూ..'ఎన్ని శుక్రవారాలు... ఫస్ట్ డే ఫస్ట్ షోలు.. ఉదయాన్నే 8.45కి సీట్లో కూర్చోవడానికి పరుగెత్తుకుంటూ.. అప్పుడే 20 ఏళ్లు గడిచాయా?? ప్రతి సినిమా వినోదాత్మకంగా ఉన్నా, నిరాశపరిచినా నాకు ఏదో గుణపాఠం చెబుతోంది. ప్రియమైన ప్రసాద్ ఐమాక్స్.. మీరు సినిమా మాత్రమే కాదు, మీరు నా తరగతి గది.. ధన్యవాదాలు' అంటూ వీడియోను పోస్ట్ చేశారు. అయితే ఆ వీడియోలో ప్రేక్షకుల భావోద్వేగాలను చక్కగా ప్రస్తావించారు. 

(ఇది చదవండి: నిండు గర్భంతో పోకిరీ భామ.. బేబీ బంప్‌ ఫోటో వైరల్!)

Advertisement
 
Advertisement
 
Advertisement