డైరెక్టర్‌ శంకర్‌ కూతురు గురించి ఈ విషయాలు తెలుసా? | Sakshi
Sakshi News home page

డైరెక్టర్‌ శంకర్‌ కూతురు గురించి ఈ విషయాలు తెలుసా?

Published Sun, Jul 9 2023 10:01 AM

Director Shankar Daughter Aditi Shankar About This - Sakshi

ప్రముఖ డైరెక్టర్‌ శంకర్‌ వారసురాలు ఆదితి శంకర్‌. ఆమెకు ఒక అక్క ఐశ్వర్య శంకర్, ఒక తమ్ముడు అర్జిత్ శంకర్ ఉన్నారు. ఈమె  శ్రీరామచంద్ర యూనివర్సిటీలో  వైద్య విద్య చదివింది. కానీ రాణిస్తోంది మాత్రం సినీ రంగం. మధ్యలో సంగీతంలో కూడా శిక్షణ తీసుకున్నారు. ఈమెలోని గాయని చలాకీ తనానికే బ్రాండ్‌ అంబాసిడర్‌ అని చెప్పొచ్చు.

(ఇదీ చదవండి: ఆ యాడ్‌ చేస్తే.. రూ. కోట్లలో ఇస్తామన్నారు: స్మృతి ఇరానీ)

నటనపై ఆసక్తితో  హీరోయిన్‌గా మారి తొలి చిత్రం కోలీవుడ్‌లో విరుమాన్‌లో గ్రామీణ యువతిగా జీవించారు. ఆ సినిమా భారీ విజయాన్ని సాధించింది. తాజాగా వస్తున్న చిత్రం మావీరన్‌. ఇందులో పాత్రికేయురాలిగా నటించారు. శివకార్తికేయన్‌ కథానాయకుడు. జాతీయ ఉత్తమ అవార్డు దర్శకుడు అశ్విన్‌ మడోనా దర్శకుడు. చిత్రం ఈ నెల 14వ తేదీన తెరపైకి రానుంది.

(ఇదీ చదవండి: ప్రభాస్‌ 'ప్రాజెక్ట్‌ కే' టీషర్ట్‌ కావాలంటే ఉచితంగా ఇలా బుక్‌ చేసుకోండి)

ఇది 'మహావీరుడు' పేరుతో తెలుగులోనూ విడుదల కానుంది. అలా రెండవ చిత్రంతోనే ఆదితి శంకర్‌ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతున్నారు. కాగా ఈ బ్యూటీ జులై 6వ తేదీన తన 26వ పుట్టినరోజును ప్రత్యేకంగా జరుపుకున్నారు. ఆ ఫొటోలను తాజాగా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశారు. అందులో ఇది తనకు ప్రత్యేక పుట్టిన రోజు అని పేర్కొన్నారు. ఆ ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. అదేవిధంగా మావీరన్‌ చిత్రంలో ఆదితి శంకర్‌ పాడిన బంగారుపేటలోనా... అనే పాట నెట్టింట్లో ట్రెండింగ్‌గా మారింది.


Advertisement
 
Advertisement
 
Advertisement