బాలీవుడ్ బ్యూటీఫుల్ హీరోయిన్ దియా మీర్జాకు చేదు అనుభవం ఎదురైంది. శనివారం (మే 21) జైపూర్ ఎయిర్‌పోర్టులో లగేజీ లేకుండా చిక్కుకుపోయింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా చెబుతూ తెలియజేసింది. దియా ముంబై నుంచి ఢిల్లీకి వెళ్లాల్సి ఉంది. అయితే అనివార్య కారణాల వల్ల ఆమె ప్రయాణిస్తున్న విమానాన్ని జైపూర్‌కు మళ్లించారు. దియా మీర్జా అక్కడ ఎయిర్‌పోర్టులోనే సుమారు 3 గంటలు వేచి ఉండాల్సి వచ్చింది. తర్వాత తన లగేజ్ గురించి ఎయిర్‌పోర్ట్ సిబ్బందిని అడిగితే ఎవరు ఎలాంటి సమాధానం, కానీ సహాయం అందించలేదట.
ఈ విషయాన్ని ట్విటర్ హ్యాండిల్‌లో ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, విస్తారాను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసింది. ఇందులో 'ఢిల్లీకి వెళ్లాల్లిన యూకె904 విమానం జైపూర్‌లో ల్యాండ్ అయింది. మేము 3 గంటలు విమానంలోనే వేచి ఉండాల్సి వచ్చింది. అప్పుడు ఫ్లైట్ రద్దు అయిందని, ఇక్కడ దిగమని చెప్పారు. కానీ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లేందుకు, సహాయం చేసేందుకు అక్కడ ఎవరూ లేరు. మా లగేజ్ బ్యాగులు ఎక్కడా ?' అని పేర్కొంది. దియా ట్వీట్ తర్వాత అనేక మంది ప్రయాణికులు ఆ ఎయిర్‌లైన్స్ నిర్లక్ష్యాన్ని ట్వీటర్ ద్వారా తెలిపారు. ఇంతలో వాతావరణం బాగా లేనందునే ఫ్లైట్‌ను జైపూర్‌కు మళ్లించినట్లు ఎయిర్‌లైన్స్ సంస్థ విస్తారా ట్వీట్ చేసింది.
చదవండి: ఓటీటీలతో సినీ ఇండస్ట్రీకి ముప్పుపై దీపికా సమాధానం..
UK904 to Delhi, is diverted to land in Jaipur. We wait inside the aircraft for 3hrs. Then we are told the flight is cancelled and are asked to disembark. NO ONE for the airport authority or Vistara to offer any help or answers. Where are our bags? @airvistara @AAI_Official
— Dia Mirza (@deespeak) May 20, 2022
Comments
Please login to add a commentAdd a comment