మెగాస్టార్ మోకాలికి సర్జరీ
మెగాస్టార్ చిరంజీవికి సర్జరీ పూర్తయింది. గత కొన్నాళ్లుగా మోకాలి నొప్పితో బాధపడుతున్న ఆయన.. ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో మోకాలికి సర్జరీ చేయించుకున్నారని తెలిసింది. వైద్య పరిభాషలో ఈ సర్జరీని ఆర్థోస్కోపి నీ వాష్ ట్రీట్‌మెంట్ అంటారని తెలిపారు.
(ఇదీ చదవండి: 'భోళా శంకర్' పంచాయతీ.. ట్వీట్‌తో క్లారిటీ ఇచ్చారు!)
ఏమిటీ నీ వాష్ (Knee Wash) ట్రీట్ మెంట్ ?
నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ పోర్టల్ ప్రకారం నీ వాష్ ట్రీట్ మెంట్ అంటే.. మోకాలి చిప్ప భాగంలో ఏర్పడే ఇన్ ఫెక్షన్ ను తొలగిస్తారు. అదే స్థానంలో రెండు ఎముకల మధ్య కొత్త ఫ్లూయిడ్ ను నింపుతారు. దీని వల్ల మోకాలి చిప్పకు నొప్పి ఉండదు. మోకాలి దగ్గర చాలా చిన్నగా రెండు రంధ్రాలు చేసి ఈ సర్జరీ పూర్తి చేస్తారు. దీని వల్ల కుట్లు వేయాల్సిన అవసరం పెద్దగా ఉండదు.
ఎన్నాళ్లు విశ్రాంతి అవసరం ?
నీ వాష్ ట్రీట్ మెంట్ తీసుకున్న వ్యక్తులు.. మళ్లీ మామూలుగా పనులు చేసుకోవాలంటే కనీసం 45 రోజుల విశ్రాంతి అవసరం. దీనికంటే త్వరగా కూడా కోలుకోవచ్చు. కానీ వైద్యులు సాధారణంగా 45 రోజుల పాటు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తారు.
చిరంజీవి సంగతేంటీ ?
ప్రస్తుతం చిరంజీవి వయస్సు 67 సంవత్సరాలు. అయితే ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండే చిరంజీవి వయస్సు 67 ఏళ్లు వచ్చినా.. ఇంకా చలాకీగానే కనిపిస్తారు. అయితే కొన్నాళ్లుగా మోకాలి నొప్పి పెరిగిపోవడంతో శస్త్ర చికిత్స తప్ప మరో మార్గం లేకుండా పోయింది.
ఢిల్లీలో ఎప్పటివరకు ?
ప్రస్తుతం ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్న చిరంజీవి.. మరో వారం రోజుల పాటు ఆస్పత్రిలోనే వైద్యుల పర్యవేక్షణలో ఉంటారు. ఆ తర్వాత హైదరాబాద్ రానున్నారు. అంటే ఆగస్టు 22న తన పుట్టినరోజు కల్లా ఇంటికొచ్చేస్తారని తెలుస్తోంది. ఇక్కడ ఇంట్లో మరో 5 వారాల పాటు విశ్రాంతి తీసుకుంటారు.
చిరంజీవి సినిమాల సంగతేంటీ?
ఈ మధ్య 'భోళా శంకర్'గా వచ్చిన చిరు.. తన బర్త్ డే నాడు కొత్త మూవీ ప్రారంభించబోతున్నారు. 'బంగార్రాజు' ఫేమ్ కల్యాణ్ కృష్ణ దర్శకుడు కాగా చిరు కూతురు సుస్మిత నిర్మాతగా వ్యవహరిస్తుంది. మళయాళంలో హిట్టయిన బ్రో డాడీ సినిమా రీమేక్ పట్ల కూడా చిరంజీవి ఆసక్తిగా ఉన్నట్టు సమాచారం.
ఈ ఏడాది సంక్రాంతికి 'వాల్తేరు వీరయ్య' అనే స్ట్రెయిట్ సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ కొట్టిన చిరు.. రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సొంతం చేసుకున్నారు. ఈ మధ్య థియేటర్లలో విడుదలైన 'భోళా శంకర్' మాత్రం బోల్తా కొట్టేసింది. భారీ నష్టాలు రాబోతున్నాయని తెలుస్తోంది. ఇది 'వేదాళం' అనే తమిళ సినిమాకు రీమేక్. త్వరలో చేయబోయే కొత్త ప్రాజెక్ట్ కూడా 'బ్రో డాడీ' అనే మలయాళ చిత్రానికి రీమేక్ అంటున్నారు. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
(ఇదీ చదవండి: కులాలంటే నాకు అసహ్యం: నటుడు మోహన్‌బాబు)
Comments
Please login to add a commentAdd a comment