అంబేడ్కర్‌ ఆశయ సాధనకు కృషి చే ద్దాం | Sakshi
Sakshi News home page

అంబేడ్కర్‌ ఆశయ సాధనకు కృషి చే ద్దాం

Published Mon, Apr 8 2024 8:15 AM

బండపోతుగల్‌లో అంబేడ్కర్‌ విగ్రహాన్ని 
ఆవిష్కరిస్తున్న నాయకులు  - Sakshi

చిలప్‌చెడ్‌(నర్సాపూర్‌): డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని సాహసం రాష్ట్ర అధ్యక్షుడు ముప్పారం ప్రకాశ్‌ అన్నారు. ఆదివారం మండలంలోని బండపోతుగల్‌ గ్రామంలో అంబేడ్కర్‌ యువజన సంఘం ఆధ్వర్యంలో విగ్రహాదాత బలవంత్‌రెడ్డి, ఎంఆర్‌పీఎస్‌ నాయకులు అంబేడ్కర్‌ విగ్రహన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు కల్లూరి సంజీవయ్య, చెట్లపల్లి యాదగిరి ఎంఅర్‌పీఎస్‌ జిల్లా అధ్యక్షుడు, సంగారెడ్డి జిల్లా ఎంఆర్‌పీఎస్‌ అధ్యక్షుడు భూచంద్ర, నాయకులు డప్పు శ్రీనివాస్‌, ప్రవీణ్‌కుమార్‌, ప్రభాకర్‌, పద్మ, కృష్ణ, బాల్‌రాజ్‌, సత్యం, ఎంపీటీసీ మల్లయ్య, మాజీ సర్పంచ్‌ ఈస్తారీ, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Advertisement
Advertisement