బాధ్యతగా విధులు నిర్వర్తించాలి | Sakshi
Sakshi News home page

బాధ్యతగా విధులు నిర్వర్తించాలి

Published Thu, Apr 18 2024 9:40 AM

అటవీశాఖ అధికారులతో మాట్లాడుతున్న డీఎఫ్‌ఓ రోహిత్‌రెడ్డి  - Sakshi

మన్ననూర్‌: సలేశ్వరం ఉత్సవాల్లో అటవీశాఖ అధికారులు, సిబ్బంది బాధ్యతగా విధులు నిర్వహించాలని ఐటీడీఏ ఇన్‌చార్జి పీఓ, డీఎఫ్‌ఓ రోహిత్‌రెడ్డి సూచించారు. బుధవారం మన్ననూర్‌లోని వనమాళికా ప్రాంగణంలో ఆయన అధికారులు, సిబ్బందితో వేర్వేరుగా చర్చించారు. అటవీ పరిసరాలు, వన్య ప్రాణులకు నష్టం కలగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన ప్రతి విషయంలో తగినన్ని జాగ్రత్తలు పాటించాలన్నారు. మూడు రోజుల పాటు ఉత్సవాల కోసం నియమిస్తున్న వలంటీర్లను సంయమనం చేసుకుంటూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. పోలీస్‌ అధికారులు, సిబ్బంది, స్థానికులు, పత్రికా విలేకర్లు అందరూ ఉత్సవాలు విజయవంతంగా పూర్తయ్యేలా అటవీ శాఖకు సహకరించాలన్నారు. అదేవిధంగా అటవీలో నిప్పు రాకుండా, ప్లాస్టిక్‌ తదితర వ్యర్థ పదార్థాలు పడేయకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఎఫ్‌ఆర్‌ఓ ఈశ్వర్‌, డీఆర్‌ఓ రవికుమార్‌, శ్వేత, ఎఫ్‌ఎస్‌ఓలు, బీట్‌ ఆఫీసర్లు తదితరులు ఉన్నారు.

వన్యప్రాణులకు

నష్టం కలగకుండా చర్యలు

డీఎఫ్‌ఓ రోహిత్‌రెడ్డి

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement