రైలునుంచి పడి యువకుడి మృతి | Sakshi
Sakshi News home page

రైలునుంచి పడి యువకుడి మృతి

Published Wed, May 15 2024 6:05 AM

రైలున

కాశిబుగ్గ: ౖరెలు నుంచి పడి ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం చింతలపల్లి, వరంగల్‌ రైల్వే స్టేషన్ల మధ్య చోటుచేసుకుంది. జీఆర్పీ సీఐ నరేష్‌ కథనం ప్రకారం.. ముంబాయికి చెందిన మహమ్మద్‌ ఇమ్రాన్‌ అన్సారి (18) తన బావతో కలిసి ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రిలో కొంత కాలంగా ఏసీ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. అయితే అన్సారి.. తన బావ, స్నేహితుడితో కలిసి ముంబాయి వెళ్లడానికి రాజమండ్రిలో కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ ఎక్కాడు. ధర్మారం రైల్వే గేట్‌ సమీపంలో రైలు నుంచి పడ్డాడు. దీంతో అప్‌లైన్‌ ట్రాక్‌ పక్కన పడి మృతి చెందాడు. ఈ ఘటనపై డిప్యూటీ ఎస్‌ఎస్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బావ ఫక్రుద్దీన్‌ అన్సారీకి అప్పగించామని సీఐ తెలిపారు.

రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య..

సంగెం/కాశిబుగ్గ: మద్యం మానలేక ఓ యువకుడు రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన సంగెం మండలంలో చోటు చేసుకుంది. జీఆర్‌పీ హెడ్‌కానిస్టేబుల్‌ రాజు కథనం ప్రకారం.. మండలంలోని కుంటపల్లికి చెందిన కలకొండ సుగుణ, సదానందం దంపతులకు ఇద్దరు కుమారులు రమేష్‌, మహేందర్‌(28) ఉన్నారు. పిల్లల చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోయారు. అప్పటి నుంచి పెద్దమ్మ, పెద్ద నాన్న జయలక్ష్మి, వెంకటనారాయణ పెంచారు. మహేందర్‌ కులవృత్తి వండ్రంగితో పాటు లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. మద్యం మానుకోలేక జీవితంపై విరక్తి చెంది మంగళవారం చింతలపల్లి–ఎల్గూర్‌స్టేషన్‌ మధ్య రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శవపంచనామా నిర్వహించి పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని సోదరుడు రమేష్‌కు అప్పగించినట్లు జీఆర్‌పీ హెడ్‌కానిస్టేబుల్‌ రాజు తెలిపారు.

రైలునుంచి పడి యువకుడి మృతి
1/1

రైలునుంచి పడి యువకుడి మృతి

Advertisement
 
Advertisement
 
Advertisement