● గాలిదుమారంతో నష్టంపై వ్యవసాయ శాఖ అంచనా ● సింగరేణి మండలంలోనే ప్రభావం
ఖమ్మంవ్యవసాయం: అకాల వర్షంతో జిల్లాలో 185.20ఎకరాల్లో పంటలకు నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ ప్రాథమికంగా గుర్తించింది. జిల్లా అంతటా ఆదివారం సాయంత్రం ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. దీంతో కోత దశలో ఉన్న యాసంగి పంటలకు నష్టం వాటిల్లింది. నిబంధనల ప్రకారం 33 శాతా నికి పైగా జరిగిన నష్టాన్ని పరిగణనలోకి తీసుకుని అధికారులు అంచనాలు రూపొందించారు. జిల్లాలోని సింగరేణి మండలంలో మాత్రమే అకాల వర్షం కారణంగా పంటలకు నష్టం జరిగిందని, ఈ మండలంలో 102 మంది రైతులకు చెందిన వరి, మొక్కజొన్న, మామిడి 185.20 ఎకరాల్లో పంట లకు నష్టం ఏర్పడిందని గుర్తించారు.
వరి, మొక్కజొన్న, మామిడికి నష్టం
ఈదురుగాలులు, అకాల వర్షానికి సింగరేణి మండలంలోని పోలంపల్లి, కోటిలింగాల, ఉసిరికాయలపల్లి, కోమట్లగూడెం, ఎర్రుబోడుతో పాటు మొత్తం ఎనిమిది గ్రామాల్లో కోత దశలో ఉన్న వరి, మొక్కజొన్న, మామిడి పంటలకు నష్టం వాటిల్లింది. 35 మంది రైతులకు చెందిన 48 ఎకరాల్లో వరి, అరవై మంది రైతులకు చెందిన 83.20 ఎకరాల్లో మొక్కజొన్న 60, ఏడుగురు రైతులకు చెందిన 54 ఎకరాల్లో మామిడి నష్టం వాటిల్లినట్లు గుర్తించగా.. నివేదికను వ్యవసాయ శాఖ కమిషనర్‌కు పంపించారు. కాగా, కూసుమంచి, మధిర, ఖమ్మం వ్యవసాయ డివిజన్లలోనూ పంటలకు నష్టం జరిగినా 33 శాతా నికి మించకపోవడంతో పరిగణనలోకి తీసుకోలేదని సమాచారం.
11మండలాల్లో వర్షం
జిల్లాలో ఆదివారం సాయంత్రం నుంచి రాత్రి వర కు 11మండలాల్లో వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. సింగరేణి మండలంలో అధికంగా 89.2 మి.మీ.ల వర్షపాతం నమోదైంది. అలాగే, కామేపల్లి, మండలంలో 22.4, ఖమ్మం రూరల్ మండలంలో 7.2, ముదిగొండ మండలంలో 4.8, తిరుమలాయపాలెం మండలంలో 4.6, రఘునాథపాలెం మండలంలో 3.2, ఏన్కూరు మండలంలో 2.6, కూసుమంచి మండలంలో 2.4, ఖమ్మం అర్బన్ మండలంలో 1.4, నేలకొండపల్లి మండలంలో 1.2 మి.మీల వర్షపాతం నమోదైనట్లు తెలి పారు. ఈదురుగాలులకు చెట్లు కూలి రాకపోకలకు అంతరా యం ఏర్పడింది. అలాగే, విద్యుత్ లైన్లపై చెట్లు పడడంతో సరఫరా నిలిచిపోగా సోమవారం కొమ్మలు తొలగించి సరఫరా పునరుద్ధరించారు.
Comments
Please login to add a commentAdd a comment