హాలియా (ఫైల్)
ఖమ్మంఅర్బన్: అప్పటి వరకు పెళ్లి సందడితో కళకళలాడిన ఆ ఇంట్లో ఒక్కసారిగా విషాదం చోటుచేసుకుంది. రఘునాథపాలెం మండలం బావోజీతండాలో సోమవారం చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన గుగులోత్ హాలియా(60) పెద్దకుమారుడి కొడుకు పెళ్లి భద్రాద్రి జిల్లాలో ఆదివారం జరిగింది. సోమవారం తండాలో విందు ఉండగా, హాలియా మంచుకొండకు వెళ్లి వంట వాళ్లను కలిసి తమ త్వరగా రావాలని కోరారు. అక్కడి నుంచి కూరగాయల కోసం ద్విచక్రవాహనంపై ఖమ్మం వెళ్లాడు. మార్గమధ్యలో ఖమ్మంలోని ఇల్లెందు–ఖమ్మం ప్రధాన రోడ్డులో ఖానాపురం చెరువు సమీపాన ముందు వెళ్తున్న లారీని ఇంకో వాహనం లైట్ల వెలుతురు కారణంగా గుర్తించలేకపోయిన ఆయన ఢీకొట్టాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన హాలియా అక్కడికక్కడే మృతి చెందగా.. విషయం తెలుసుకున్న కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఆయన భార్య, ముగ్గురు కుమారులు ఉండగా, ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఖమ్మం అర్బన్ పోలీసులు తెలిపారు.
కూరగాయలకు వెళ్తూ వరుడి తాత మృతి
Comments
Please login to add a commentAdd a comment